Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ .. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 10:30 PM
Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాలా, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల జూన్ నెల లక్కీడిప్ కోటాను టీటీడీ మంగళవారం ఉదయం పది గంటలకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయనుంది.

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త తెలిపారు. జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు(మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య సేవల్లో పాల్గొనాలని కోరుకునే భక్తులు అధికారిక వెబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవీవో.ఇన్’ ద్వారా టికెట్లను పొందవచ్చని సూచించారు. ఈ టికెట్లను పొందడానికి ముందుగా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అనుసరించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల జూన్ నెల లక్కీడిప్ కోటాను రేపు(మంగళవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు. భక్తులు మార్చి 18, 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు టికెట్లు లభిస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
For AndhraPradesh News And Telugu News