పల్లెకు సంక్రాంతులు!

ABN , First Publish Date - 2023-01-14T00:17:07+05:30 IST

అలికి పెట్టిన ముగ్గు.. తళ తళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద... మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద..

పల్లెకు సంక్రాంతులు!
ఆడాళ్లూ..మీకు జోహార్లు : సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పిండి వంటలు చేస్తున్న హోం మంత్రి వనిత, కలెక్టర్‌ మాధవీలత

దేశవిదేశాల నుంచి స్వగ్రామాలకు రాక

ఖాళీ అవుతున్న పట్టణాలు

అల్లుళ్లు,కూతుళ్లతో నిండుగా నివాసాలు

పండుగ ఆనందంలో కుటుంబాలు

జిల్లా వ్యాప్తంగా సందడే సందడి

నేడు భోగి పండుగకు సన్నాహాలు

అలికి పెట్టిన ముగ్గు.. తళ తళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద... మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద.. గొబ్బియ్యళ్లో..గొబ్బియ్యళ్లో.. చలిమంట వెలుగల్లా తుమ్మెద ఓ తుమ్మెద.. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా.. సరదాలు తెచ్చింది తుమ్మెదా.. కొత్త ధాన్యాలతో.. కోడి పందేలతో.. ఊరే ఉప్పొంగుతుంటే.. ఇంటింటా.. ఆఆఆ.. పేరంటం.. ఊరంతా.. ఆఆఆ.. ఉల్లాసం.. ప్రస్తుతం జిల్లాలో పల్లెలన్నీ ఇలాగే ఉన్నాయి.. ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా స్వగ్రామాలకు చేరుకోవడంతో సంక్రాంతులు వచ్చాయి. నిన్నటి వరకూ నీరసంగా కనిపించిన గ్రామాలన్నీ కొంగొత్తగా కనిపిస్తున్నాయి.. మూడు రోజుల పండుగకు ముస్తాబై కొత్త కళను సంతరించుకున్నాయి. నేడు భోగిపండుగకు సన్నద్ధమయ్యాయి..

ఊరంతా పండగ

కోరుకొండ /అనపర్తి, జనవరి 13 : అన్ని ప ండుగలదీ ఒక లెక్క.. సం క్రాంతిది మరో లెక్క.. ఆ పండుగ పేరు లోనే ఉత్సాహం.. అందుకే ఎక్కడ ఉన్నా సంక్రాంతికి ఇంటి వాలిపోవాల్సిందే.. పెద్ద పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిందే. తూర్పుగో దా వరి జిల్లాలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజుకు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలకు పండగే. ఎం దుకంటే గ్రామాలకు చెందిన వారు ప్రపం చంలో ఎక్కడ స్థిరపడినా.. ఎంత వ్యయ ప్రయాసలకు లోనైనా ప్రతి సంవత్సరం పం డుగకు వస్తారు.. ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులే కాకుండా చిన్ననాటి స్నేహితుల మధ్య వారం రోజులు పాటు గడుపుతారు. జిల్లా నుంచి జీవనోపాధి కోసం దేశం నలుమూ లలకు వెళ్లినప్పటికీ వారంతా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. దీంతో నిన్నటి వరకు పెద్దగా సందడి గ్రామీణ ప్రాంతాల్లో నేడు కొత్త వెలుగులు సంతరించు కున్నాయి. కోరుకొండ, సీతానగరం, గోకవరం, అనపర్తి,కొవ్వూరు,నిడద వోలు రాజ మహేంద్రవరం రూరల్‌,కడియం మండలాల్లోని గ్రామా లకు చెందిన అనేక మంది ప్రాంతాల్లో అనేక మంది పారిశ్రామి కవేత్తలుగా ఎదిగారు. ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.వారంతా గురు వా రం, శుక్రవారం సొంత ఊర్లకు తిరిగి వచ్చారు. కోరుకొండ దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాకలపల్లి రామచం ద్రరాజు, నెక్కంటి సీతారామయ్య, సూదిన గంగాధర్‌, మార్ని శ్రీనివాసరావు ఇలా ఎంతో మంది దేశం నలుమూ లల నుంచి శుక్రవారం దోసకా యలపల్లి గ్రామానికి చేరుకున్నా రు.వీరంతా వారంరోజులు పాటు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అక్కడే ఉండి సంక్రాంతి సంబరాలు ఆస్వాదిస్తారు. ఎన్నో ఏళ్లగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ ఇటువంటి వారితో సందడి నెలకొంది.

ఎక్కడున్నా సంక్రాంతికి ఇంటికి రావాల్సిందే..

పాకలపాటి సోదరులు, పారిశ్రామికవేత్తలు

దోసకాయలపల్లికి చెందిన పాకలపాటి రామచంద్రరాజు, పాకలపల్లి పాండురంగ నాథరాజవర్మ సోదరులు. వ్యాపారరిత్యా విదేశాల్లో ఉంటారు. సంక్రాంతికి మాత్రం సొంతూళ్లో వాలిపో తారు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చేందుకు వాళ్లు చిన్ననాడు నివ సించిన పాత పెంకుటిల్లుని అలాగే ఉంచారు. ప్రతి ఏడాది సం క్రాంతికి వచ్చి నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు.సంప్రదాయ బద్దంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. దీనిపై వాళ్లను ప్రశ్నిస్తే ప్రతి ఏడాది సంక్రాంతి వస్తేనే ఆనందంగా ఉంటుందని.. ఆ ఆనందం ఏడాదంతా మా జీవితాల్లో ఉంటుందని చెబుతున్నారు.

సంక్రాంతికి తప్పనిసరిగా వస్తా..

జగదీష్‌ బొమ్మిశెట్టి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ.

అనపర్తికి చెందిన జగదీష్‌ బొమ్మిశెట్టి ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో పన్నెండేళ్ల కిందటే సినీ పరిశ్రమకు వెళ్లి స్థిరప డ్డాడు. ఇప్పటి వరకు మూడు తెలుగు చిత్రాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రపీగా పనిచేశాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూషను వివాహం చేసుకు న్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంతూరుకు భార్యతో వచ్చా రు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి సొంతూరు చేరుకోడం నాకు అలవాటు..ఆ నాలుగు రోజులు అమ్మ నాన్నలతో గడపడం నాకు ఎంతో ఇష్టం.అందుకే ఈ ఏడాది కూడా వచ్చా.

బస్సులన్నీ..ఫుల్‌గా..

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 13 : సంక్రాంతి పెద్ద పండక్కి జనాలు సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌గా వస్తున్నాయి. ఏడు షెడ్యూలు బస్సులతోపాటు స్పెషల్‌ సర్వీలు వేసినా రద్దీ మా త్రం తగ్గలేదు. హైదరాబాద్‌లో రాత్రిపూట బయలుదేరుతున్న ఈ బస్సులన్నీ ఉదయమే రాజమహేంద్రవరం చేరుకుంటున్నాయి. రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడం, జనరల్‌ బోగీల్లోనూ విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు, చుట్టుపక్కల ఊళ్లకు వచ్చే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం రాత్రి సుమారు 30 స్పెషల్‌ బస్సులు హైదరాబాద్‌ పంపించిన అఽధికారులు శనివారం రాత్రికి మరో 40 స్పెషల్‌ బస్సులను హైదరాబాద్‌కు పంపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లిన స్పెషల్‌ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే శనివారం ఉదయానికి ఈ బస్సులన్నీ నిండుగా వస్తాయని, సంక్రాంతి రోజు ఉదయం బస్సు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనాతో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని రాజమహేంద్రవరం డిపోతో పాటు గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే షెడ్యూలు బస్సులకు టిక్కెట్లన్నీ అయిపోయాయి. భోగి, సంక్రాంతి... ఈ రెండు రోజుల రష్‌ ముగిసిపోతే ఇక పండగ తర్వాత తిరుగు ప్రయాణాల వరకూ లోకల్‌ ట్రాఫిక్‌పైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. పండగ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు 17, 18వ తేదీల్లో ఉండవచ్చని, అప్పుడు మళ్లీ స్పెషల్స్‌ పెడతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం రూట్లలోనూ రద్దీ కనిపిస్తోంది. దీంతో రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సందడి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చిన వేలాదిమంది ప్రజలు రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. వీరంతా ప్రతిఏటా పెద్ద పండక్కి తమ సొంతూళ్లకు వెళుతుంటారు. కొంత మంది రైళ్లను ఆశ్రయిస్తే, మరికొందరు విశాఖపట్నం వరకూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇచ్ఛాపురం, పార్వతీపురం వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి కొన్ని సర్వీసులున్నా వాటికి రాజమహేంద్రవరంలో సీట్లు దొరకడం కష్టం. దీంతో ఎక్కువ మంది విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో విశాఖపట్నం, శ్రీకాకుళం రూట్ల బస్సుల్లో రద్దీ నెలకొంది.

ప్రతి ఇంట సిరిసంపదలు పొంగాలి

బొమ్మూరు : ఈ సంక్రాంతి అందరి కుటుంబాల్లో ఆనందాన్ని పంచాలి. అందరూ త్సాహంగా పండుగ చేసుకోవాలి. సంప్రదాయ వంటలు, హరిదాసు నృత్యాలతో జరుపుకునే వేడుక కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేశాం.. రైతులు ఆనందంగా ఉన్నారు.- మాధవీలత, జిల్లా కలెక్టర్‌

Updated Date - 2023-01-14T00:17:10+05:30 IST