ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodali Nani: మరోసారి నోరుపారేసుకున్న కొడాలి నాని

ABN, First Publish Date - 2023-09-26T16:13:18+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్‌(Nara Lokesh)పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్‌(Nara Lokesh)పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు. జగన్‌రెడ్డి మొప్పు కోసం పదే పదే ఆరోపణలు చేసే ఆయన ఈసారి చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఆయన వైసీపీ పార్టీ(YCP party) కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకు ఎవరున్నారు..? ఆ ముగ్గురే జైలులో ములాఖత్‌కు వెళ్తున్నారు.. మిగతా వారు ఎవరు వెళ్లట్లేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయితే లోకేష్ ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిని ఏదో చేస్తానన్నాడు.. కానీ ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది..?. రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా..?. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు..?. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా..?. పవన్‌కళ్యాణ్‌ని లోకేష్ అన్నయ్య అంటాడు.

ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడు. 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు. హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా..? తన భర్తకు వసతులు లేవని భువనేశ్వరి అంటున్నారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలి. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం మాకు తిరుగు లేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై పక్క రాష్ట్రం నేతలను బతిమాలితేనే మాట్లాడారు. ‘‘బాబుతో నేను’’ అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా..? చంద్రబాబు కోసం ఎవ్వరూ పాదయాత్రలు చేయరు. పొరుగు దేశాలు.. రాష్ట్రాల్లో చంద్రబాబు కోసం బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా’’ అని కొడాలి నాని ప్రశ్నించారు.

Updated Date - 2023-09-26T16:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising