ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest: రాష్ట్రపతి ద్రౌపది మూర్ముని కలిసిన నారా లోకేష్

ABN, First Publish Date - 2023-09-26T16:49:42+05:30

తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu) అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఈ అరెస్ట్‌పై స్పందించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) రాష్ట్రపతి ద్రౌపది మూర్ము(President Draupadi Moormu)ని కోరారు.

ఢిల్లీ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఈ అరెస్ట్‌పై స్పందించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) రాష్ట్రపతి ద్రౌపది మూర్ము(President Draupadi Moormu)ని కోరారు. మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి మూర్ముని నారా లోకేష్, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురదజల్లే లక్ష్యంతో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతికి అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని నారా లోకేష్ కోరారు.

Updated Date - 2023-09-26T16:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising