Cyclone Effect: విజయవాడలో భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు
ABN , First Publish Date - 2023-12-05T09:33:11+05:30 IST
Andhrapradesh: ‘‘మిచాంగ్’’ తుఫాన్ కారణంగా నగరంలో నిన్న(సోమవారం) నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి.
విజయవాడ: ‘‘మిచాంగ్’’ తుఫాన్ కారణంగా నగరంలో నిన్న(సోమవారం) నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. నిర్మలా కాన్వెంట్ ,మొగల్రాజపురం, ఈనాడు, పంట కాలవ ,చుట్టుగుంట, కృష్ణలంక, భవానిపురం, బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. రోడ్లు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మ్యాన్ హోల్స్ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లమీదకు వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ కాలువలు ఉన్నాయో తెలియని దుర్భర పరిస్థితి నెలకొంది. రహదారులపై భారీగా వర్షాలు నీరు వచ్చి చేరడంతో కొన్ని రోడ్లను అధికారులు పూర్తిగా మూసివేశారు.