Pawan Kalyan: కోనసీమ అంటే నాకు భయం: పవన్‌

ABN , First Publish Date - 2023-06-21T20:28:01+05:30 IST

కోనసీమ అంటే తనకు భయమని, ఇంత ప్రేమ ఉన్నచోట కోపం కూడా ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: కోనసీమ అంటే నాకు భయం: పవన్‌

కాకినాడ: కోనసీమ అంటే తనకు భయమని, ఇంత ప్రేమ ఉన్నచోట కోపం కూడా ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. కాకినాడ సభలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ (YCP) అక్రమాలు చదివి చదివి.. తనకు సైట్ పెరిగిపోయిందన్నారు. స్వయం శక్తితో ఎదిగిన కుటుంబం తమదని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాకు అండగా ఉంటానని పవన్‌ హామీ ఇచ్చారు. రైతు సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదని తెలిపారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) లాంటి వాళ్లు సునాయాసంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ద్వారంపూడి వంటి దళారులు రైతులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉత్పత్తి కులాల దగ్గర పెట్టుబడి లేనందునే దళారులు శాసిస్తున్నారని, జనసేన అధికారంలోకి రాగానే.. ఆ పెట్టుబడి సాయం అందిస్తామని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.

Updated Date - 2023-06-21T21:15:04+05:30 IST