AP Minister: అలాంటి వాడు టీడీపీ వారసుడా.. వారాహి ఏది.. ఎక్కడ?.. లోకేష్, పవన్‌పై మంత్రి విసుర్లు
ABN , First Publish Date - 2023-02-15T11:45:04+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు.
విజయవాడ: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawankalyan)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu)సెటైర్లు విసిరారు. లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalamPadayatra)పై విరుచుకుపడ్డారు. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేరని తెలిపారు. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అని లోకేష్ అన్నారన్నారు. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా (TDP Varasudu) అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) చెప్పిన ఖర్మ అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు. టీడీపీ సీనియర్ నేత అచ్చెంనాయుడు (TDP Leader Atchannaidu) లాంటి వాళ్ళు ఎందుకు లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) పెట్టామా అని తలలు పట్టుకుంటున్నారని మంత్రి తెలిపారు.
రాజధానులపై సందేహం వద్దు...
ఏపీ మూడు రాజధానుల (AP Three Capitals)పై సందేహం అవసరం లేదని... వైసీపీ విధానం మూడు రాజధానులే అని స్పష్టంచేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అంటూ చెప్పుకొచ్చారు. రాయలసీమ (Rayalaseema), ఉత్తరాంధ్ర (Uttarandhra), కోస్తా (Kosta) అనే స్థానిక భావాలున్నాయని... వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు అని తెలిపారు. జనసేన అధినేత పవన్ (PawanKalyan)పైనా అంబటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నే చాలా పచ్చబొట్లు వేసుకోవాలన్నారు. వారాహి (Varahi) ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అంటూ ప్రశ్నించారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలని హితవుపలికారు. వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్‌కే ఉందన్నారు. లోకేష్, పవన్‌లకు నిబద్ధత లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
రూ.16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్...
కాగా.. ఈరోజు ఉదయం భూగర్భ జలవనరుల డేటా సెంటర్ (Groundwater Data Center)ను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయన్నారు. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో ఇక్కడి ల్యాబ్ నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏలూరు (Eluru), విజయవాడ (Vijayawada), చిత్తూరు (Chittoor), విశాఖ (Visakhapatnam)లలో డెటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని... రూ.16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.