Nagababu : అప్పటి నుంచి సామాన్య కార్యకర్తగానే పని చేస్తున్నా
ABN , First Publish Date - 2023-04-15T14:03:54+05:30 IST
2019 ఎన్నికల తర్వాత నుంచి సామాన్య కార్యకర్తగానే పని చేస్తున్నానని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఆయన జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో ఓ వీడియో విడుదల చేశారు.
అమరావతి : 2019 ఎన్నికల తర్వాత నుంచి సామాన్య కార్యకర్తగానే పని చేస్తున్నానని మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ప్రకటించారు. ఈ మేరకు నేడు ఆయన జనసేన (Janasena) ప్రధాన కార్యదర్శి హోదాలో ఓ వీడియో విడుదల చేశారు. వివిధ ప్రాంతాలలో ఉన్న నాయకులను కలిసి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నానన్నారు. హోదా కన్నా.. పార్టీ కోసం పని చేయడంపైనే దృష్టి పెట్టానన్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత బాధ్యతతో పని చేయాల్సిన అవసరం తనపై ఉందని నాగబాబు వెల్లడించారు.
జనసైనికులు, వీర మహిళలు పవన్ సిద్దాంతాలతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వారిని మరింతగా ప్రోత్సహిస్తూ.. వారితో కలిసి పని చేస్తూ ముందుకు సాగుతానని నాగబాబు వెల్లడించారు. వీలున్నంత వరకూ అందరినీ కలుసుపుకుని పార్టీ అబివృద్ధి కోసం పని చేస్తానన్నారు. జగన్ ప్రభుత్వం అవినీతి, అవకతకవలను తమ అధినేత అంశాల వారీగా ఎత్తి చూపుతున్నారన్నారు. జనసేనను జనాలకు మరింత చేరువ చేసేలా తమ కార్యక్రమాలు ఉంటాయని నాగబాబు తెలిపారు. పవన్ కల్యాణ్ నిజాయతీ, చిత్తశుద్దిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఇటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అనుకునేలా ప్రజలకు వివరించాలని నాగబాబు పేర్కొన్నారు.