Nagababu : పవన్‌పై పోటీకి సిద్ధమన్న అలీ కామెంట్స్‌పై ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-01-21T12:58:50+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు అనేది త్వరలోనే చెబుతామని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు తెలిపారు.

Nagababu : పవన్‌పై పోటీకి సిద్ధమన్న అలీ కామెంట్స్‌పై ఏమన్నారంటే..

Nagababu : వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు అనేది త్వరలోనే చెబుతామని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు తెలిపారు. ఏపీలో పాలన చెత్తగా ఉందని.. నాలుగేళ్లుగా అరాచకం, రౌడీ రాజ్యం, గంజాయి రాష్ట్రంగా మారిపోయిందన్నారు. శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి ప్రోగ్రాంతో రాష్ట్రంలో జనసేన నాయకులపై వైసీపీ కన్నేసి ఉంచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై జనసైనికులతో చర్చిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం అన్న అలీ కామెంట్స్‌పై.. నో కామెంట్స్ అని నాగబాబు చెప్పారు.

Updated Date - 2023-01-21T12:58:53+05:30 IST