Share News

Chandrababu lokesh Wishes: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌కు సీఎం, లోకేష్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:49 PM

Chandrababu lokesh Wishes: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కు సీఎం, మంత్రి విషెస్ తెలియజేశారు.

Chandrababu lokesh Wishes: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌కు సీఎం, లోకేష్ శుభాకాంక్షలు
Chandrababu lokesh Wishes

అమరావతి, మార్చి 14: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పవన్‌కు సీఎం, మంత్రి విషెస్ చెప్పారు. జనసేన నిబద్ధత, విలువలతో కూడిన పార్టీ అని ముఖ్యమంత్రి అనగా... జనసేనకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందని మంత్రి లోకేష్ పోస్టు చేశారు.


ఎక్స్‌ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... జనసేన నిబద్ధత విలువలతో కూడిన రాజీకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న పార్టీ అని అన్నారు. 12 సంవత్సరాలు ఆవిర్భావ వేడుకల సందర్బంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు, జన సైనికులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు.


పవన్ అన్నకు అంటూ...

మరోవైపు లోకేష్‌ కూడా ఎక్స్‌ వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పవన్ కళ్యణ్ అన్నకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు అని అన్నారు. ఏపీ ఆర్ధిక, సామాజిక అభివృద్దికి జనసేన చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో, అభివృద్ది చేయడంలో జనసేన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. జనసేనకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ మంత్రి ట్వీట్ చేశారు. అంతే కాకుండా తన ట్వీట్‌ను జనసేన జయకేతనంకు ట్యాగ్ చేశారు లోకేష్. తన ట్వీట్ కింద పవన్ కళాణ్ పిడికిలి బిగించి మైక్ పట్టుకుని మాట్లాడుతున్న పవన్ చిత్రాన్ని ఉంచారు. అదే చిత్రంలో సాధించిన విజయాలు స్మరించుకుందాం... భవిష్యత్తుకు మార్గనిర్ధేశం చేసుకుందాం... జయకేతనం ఎగురవేద్దాం అంటూ లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


తరలివస్తున్న జనసైనికులు...

మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత పవన్ హైదరాబాద్ నుంచి పిఠాపురంకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో జనసేన జయకేతనం సభ మొదలుకానుంది. ఇప్పటికే జనసేన సభకు అభిమానులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒక్కో గ్యాలరీలో 2500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఎండ వేడిమితో గ్యాలరీలను వీడి నీడ ఉన్న ప్రాంతాలకు ప్రజలు పరుగులు పెట్టారు. ఎండ తగ్గిన తర్వాత గ్యాలరీల్లోకి వస్తామని మహిళలు చెప్తున్నారు. అలాగే వచ్చిన వారికి పిఠాపురం పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి సభ అనంతరం కూడా భోజనాలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది మధ్యలో సభా వేదికపై జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు.


కిక్కిరిసిన చిత్రాడ...

ఇదిలా ఉండగా.. చిత్రాడ సభ ప్రాంగణం జనసైనికులతో కిక్కిరిసిపోయింది. దీంతో వీఐపీ పాసులు ఉన్నా సరే వారిని పోలీసులు లోపలికి అనుమతించని పరిస్థితి. ఇప్పటికే లోపల గ్యాలరీలు అన్ని ఫుల్ అయిపోయాయి. అటు కార్యకర్తల గ్యాలరీలు కూడా నిండిపోవడంతో వచ్చిన వారిని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో... జనసేన నాయకులు, కార్యకర్తలు వెనుతిరుగుతున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 04:51 PM