గడప గడపకు ఎమ్మెలే... శుభ్రమవుతున్న రోడ్లు
ABN , First Publish Date - 2023-08-12T22:31:30+05:30 IST
స్థానిక వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రెండురోజులుగా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులు రోడ్లను శభ్రం చేయటం, కాలువల్లో పూడిక తీయటం, రోడ్ల వెంబడి

కావలి, ఆగస్టు12: స్థానిక వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రెండురోజులుగా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులు రోడ్లను శభ్రం చేయటం, కాలువల్లో పూడిక తీయటం, రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లడం చేస్తున్నారు. ఇంతకాలం వెంగళరావునగర్ సమస్యలు పట్టించుకోని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే వస్తున్నాడని ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయా ? అని స్థానిక ప్రజలు అంటున్నారు.