Hyderabad: న‘గరం’ @ 40.. పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:43 AM
హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగడంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

- పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ సిటీ: నగరంలో ఎండలు మండుతున్నాయి. రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: AE: ఏసీబీకి దొరికిన విద్యుత్ శాఖ ఏఈ
గురువారం నగరంలోని కాప్రా, నాచారం, ఎల్‌బీనగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట(Yusufguda, Begumpet) ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు, గాజులరామారం, రాజేంద్రనగర్(Gajularamaram, Rajendranagar)లలో అత్యధికంగా 40 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని బేగంపేట(Begumpet) వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News