వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సం

ABN , First Publish Date - 2023-06-04T01:51:19+05:30 IST

మండలంలోని యడవల్లి పంచాయతీ పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారా ముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది.

వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సం

రాచర్ల, జూన్‌ 3 : మండలంలోని యడవల్లి పంచాయతీ పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారా ముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హోమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రంగనాయకస్వామికి పోటెత్తిన భక్తులు

గిద్దలూరు : మండలంలోని జే.పుల్లలచెరువు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేసవికాలం కావడం, వివాహాలు జరుగడంతో నూతన వధూవరులు సైతం గుండం లో స్నానం ఆచరించి రంగనాయకస్వామికి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు అన్ని సత్రాలలో అన్నదానం నిర్వహించారు.

తేనెటీగల దాడులు

ఆలయానికి భక్తులు, లచ్చమ్మపేట నుంచి రంగనాయకస్వామి ఆలయానికి నడుచుకుంటూ వెళ్లేక్రమంలో భక్తులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడులు చేశాయి. దీంతో భక్తులు సైతం పరుగులు తీశారు. అయినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు భక్తులను తేనెటీగలు కుట్టాయి. దీంతో వీరిద్దరిని ఆటోలో సమీప ఆసుపత్రికి తరలించారు.

శివాలయంలో ప్రత్యేక హోమాలు

మార్కాపురం వన్‌టౌన్‌ : మార్కాపురం పట్టణంలోని జగదాంబ సమేత మార్కండే శ్వర స్వామి ఆలయం(శివాలయం)లో జేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అర్చకలు ఏలూ రి ఆంజనేయశర్మ, రెంటచింతల వరుణ్‌తేజ శర్మలు శ్రీవిద్యా హోమం, చంఢీహోమం, శ్రీ చక్ర నవావరణ అర్చణ, అభిషేకాలు నిర్వ హించారు. ఆలయ చైర్మన్‌ పి.కేశవరావు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-04T01:51:19+05:30 IST