వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2023-09-04T00:03:01+05:30 IST

నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సమక్షంలో అరసవిల్లిలోని వారి స్వగృహంలో ఆదివారం చాంద్‌ బాషా, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ముబారక్‌ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి గుండ దంపతులు

అరసవల్లి, సెప్టెంబరు 3: టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సమక్షంలో అరసవిల్లిలోని వారి స్వగృహంలో ఆదివారం చాంద్‌ బాషా, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ముబారక్‌ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం సెక్యులర్‌ పార్టీ అని, అధికారంలో ఉన్నప్పుడు షాదీ ఖానాలు, మసీదుల అభివృద్ధి కోసం చర్యలు, రంజాన్‌ తోఫా వంటి కార్యక్రమా లను ముస్లింల సంక్షేమం కోసం చేపట్టినట్టు గుర్తు చేశారు. వైసీపీ హయంలో ముస్లింలపై దాడులు పెరిగాయని, సంక్షేమం పట్టించుకునే పరిస్థితి పూర్తిగా లేదన్నారు. వేధింపులను భరించలేక ఒక ముస్లిం కుటుంబం రైలు కింద పడి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావ డం ఖాయమని, అందరికీ మంచి రోజులు రానున్నాయని తెలిపారు. కార్యక్ర మంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, ముస్లిం సంగ నాయకులు షాన్‌, షఫీ, రోషన్‌ బాషా, ఎస్‌కే బాషా, బాబు, సర్కార్‌, బాల, మహమ్మద్‌ గాలిబ్‌, ఎస్‌కే మదీనా ఉస్మాన్‌ బేగ్‌, హబీబ్‌, ఎస్‌కే సలీం, బుహరి పాల్గొన్నారు.

బహిరంగ చర్చకు రావాలి

అరసవల్లి, సెప్టెంబరు 3: శ్రీకాకుళం నియోజక వర్గంలో 2004 సంవత్సరం నుంచి జరిగిన అవినీతి, అభివృద్ధి మీద నిజాలు ప్రజలకు తెలియజేయడానికి మం త్రి ధర్మాన ప్రసాదరావు గానీ, అతని అనుచరులు గానీ బహిరంగ చర్చకు రావాలని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సవాల్‌ విసిరారు. ఆదివారం అరస వల్లిలో గల తన స్వగృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి ఎన్నుకున్న ప్రభుత్వ విధానాలను అనుసరించి ఉంటాయని, వ్యక్తిగత అజెం డాకు తావులేకుండా నాయకులు వాటిని ప్రజలకు అం దించాలన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక రంగం కుదేలైందన్నారు. గత టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గుండ లక్ష్మీదేవి హ యాంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, అందుకే ఆమె రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ శాసనసభ్యురాలిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. వంశధార నదిపై జా తీయ రహదారిని కలుపుతూ గార గ్రామం దగ్గర వంతెన నిర్మాణం, శివారు గ్రామాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాల పూర్తి, శ్రీకాకుళం మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో తాగునీటి ఎద్దడి లేకుండా డైక్‌ నిర్మాణం, సింగుపురం వద్ద నర్సింగ్‌ కాలేజీ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. మీరు కనీసం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు పోయే రోడ్డు విస్తరణ పనులను నాలుగేళ్లయినా పూర్తిచేయని దుస్థితి లో ఉన్నారన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి మీరు చేసినట్లు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రతీ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న నిర్ణయంలో భాగంగా శ్రీకాకుళానికి రిమ్స్‌ కేటాయించారని, ఈ విషయంలో మంత్రి ధర్మాన పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే నైర వ్యవసాయ కళాశాల, ప్రస్తుతం యూనివర్సిటీగా మారిన పీజీ సెంటర్‌ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినవేనన్నారు.

Updated Date - 2023-09-04T00:03:01+05:30 IST