Jio AirFiber: వైఫై వినియోగదారులకు శుభవార్త.. జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ప్రకటించిన అంబానీ!

ABN , First Publish Date - 2023-08-28T16:32:44+05:30 IST

వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్‌ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023 వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.

Jio AirFiber: వైఫై వినియోగదారులకు శుభవార్త.. జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ప్రకటించిన అంబానీ!

వైఫై(Wifi) వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్‌(Jio AirFiber) ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023( AGM 2023) వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ( Mukesh Ambani) అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 5జీ హాట్‌స్పాటైనా జియో ఎయిర్ ఫైబర్‌ను గత ఏజీఎమ్ వార్షిక సమావేశాల్లోనే ప్రకటించారు. కానీ అది ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది అప్పుడు వెల్లడించలేదు. తాజాగా 46వ ఏజీఎమ్ వార్షిక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు అంబానీ తెలిపారు. జియో ఎయిర్ ఫైబర్‌ లాంచ్ అయ్యాక అన్ని రిలయన్స్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. కాగా జియో ఎయిర్ ఫైబర్‌కు ఎటువంటి కేబుల్ అవసరం ఉండకపోవడంతో వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ జియో ఎయిర్ ఫైబర్ ధర ఎంత ఉంటుందనే విషయంపై అంబానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్కెట్‌లో ఉన్న వాటి కంటే 20 శాతం తక్కువగానే ఉండనుందట. అంటే రూ.6,000గా ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.


జియో ఎయిర్‌ ఫైబర్ ఫీచర్లు

జియో ఎయిర్‌ ఫైబర్ (Jio Air Fiber) అనేది వైర్‌లెస్ 5G హాట్‌స్పాట్. దీనిని ఇంట్లో లేదా కార్యాలయంలో సెటప్ చేసుకోవచ్చు. ఫైబర్ లాంటి అధిక బ్రాడ్‌బ్యాండ్ వేగంతో నెట్ పొందాలంటే దీనిని తీసుకోవచ్చు.

2022 ఏజీఎమ్‌లో జియో ఎయిర్‌ ఫైబర్ (Jio Air Fiber) ఒక క్రీడా ఈవెంట్‌కు సంబంధించిన అనేక కెమెరా యాంగిల్స్‌ను హై డెఫినిషన్‌లో ఏకకాలంలో ప్రసారం చేయగలదని తెలిపారు.

జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా వినియోగదారులు ‘జియో క్లౌడ్ పీసీ’ అనే క్లౌడ్‌లో హోస్ట్ చేయబడిన వర్చువల్ పీసీని ఎంచుకోగలరని కూడా తెలిపారు.

Updated Date - 2023-08-28T16:32:44+05:30 IST