No Confidence Motion : అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ.. అమిత్ షా, స్మృతి, రాహుల్ పదునైన మాటలతో దద్దరిల్లనున్న లోక్ సభ..
ABN , First Publish Date - 2023-08-09T11:12:53+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో బుధవారం చర్చ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు తమ వాదనలను గట్టిగా వినిపించబోతున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో బుధవారం చర్చ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు తమ వాదనలను గట్టిగా వినిపించబోతున్నారు.
లోక్ సభలో కాంగ్రెస్ ఉప నేత గౌరవ్ గొగోయ్ ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తీర్మానంపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేవారిలో కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ ఉన్నారు. ప్రతిపక్షాల తరపున మాట్లాడేవారిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు వినిపించే పదునైన వాదనలతో లోక్ సభ దద్దరిల్లే అవకాశం ఉంది. లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడతారని తెలిపారు.
మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆయన లోక్ సభ సభ్యత్వంపై విధించిన అనర్హత వేటును తొలగించి, ఆయన ఎంపీ పదవిని లోక్ సభ సచివాలయం పునరుద్ధరించడంతో సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతున్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా దాదాపు 331 మంది ఎంపీలు ఉన్నందువల్ల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రతిపక్షాలు గెలిచే అవకాశం లేదు. అయితే మణిపూర్ సమస్యపై మోదీ మాట్లాడేలా చేయడమే తమ లక్ష్యమని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..