Opposition leaders meeting: పాట్నాలో విపక్ష పార్టీల ఐక్యత సమావేశం..‘ఇది సిద్దాంతాల యుద్ధం’ సమావేశానికి ముందు రాహుల్..
ABN , First Publish Date - 2023-06-23T11:22:16+05:30 IST
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత సమావేశం మరికొద్దిసేపట్లో బీహార్ సీఎం నితీష్‌కుమార్ నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 15 ప్రతి పక్ష పార్టీలు పాల్గొననున్నాయి.

పాట్నా: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత సమావేశం (Opposition leaders meeting) మరికొద్దిసేపట్లో బీహార్ సీఎం నితీష్‌కుమార్ (Bihar CM Nithish Kumar) నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 15 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.
విపక్ష పార్టీల ఐక్యత సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), శివసేన (యూబీటి) నేత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే పాట్నా చేరు కున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ప్రధాన ఫ్రంట్ ఏర్పాటు రోడ్ మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యతన విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు.