Congress MP: ప్రభాకరన్‌ ప్రాణాలతో లేడు

ABN , First Publish Date - 2023-02-19T08:11:07+05:30 IST

ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ ప్రాణాలతో లేడనే విషయం తనకు స్పష్టంగా తెలుసని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు,

Congress MP: ప్రభాకరన్‌ ప్రాణాలతో లేడు

- కాంగ్రెస్‌ ఎంపీ తిరునావుక్కరసర్‌

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 18: ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ ప్రాణాలతో లేడనే విషయం తనకు స్పష్టంగా తెలుసని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, తిరుచ్చి ఎంపీ ఎస్‌.తిరునావుక్కరసర్‌(Trichy MP S. Thirunavukkarasar) తెలిపారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇళంగోవన్‌కు మద్దతుగా శనివారం ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌(LTTE leader Prabhakaran), దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, తాను ముగ్గురం ఒకేచోట కలసి భోంచేసే సాన్నిహిత్యం ఉందన్నారు. తనకు లభించిన సమాచారం మేరకు ప్రభాకరన్‌ ప్రాణాలతో లేడన్నారు. రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలుగా ఉండాలని, అనాగరికంగా ఉండరాదన్నారు. అధికార పార్టీ కూడా నాగరికంగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఏ అధికార పార్టీ అయినా, ఒకటి, రెండు లోటుపాట్లు ఉండడం సహజమేనని అన్నారు. రాష్ట్రంలో డీఎంకే పాలన భేషుగ్గా ఉందని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో తమ గెలుపు ప్రకాశవంతంగా ఉందని తిరునావుక్కరసర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-19T08:11:09+05:30 IST