Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

ABN , First Publish Date - 2023-08-20T19:00:57+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచారు. 2003 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాలు వెనుకబడిన రాష్ట్రమనే నానుడిని తొలగించడంలో విజయం సాధించినట్లు తెలిపారు.

Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

భోపాల్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచారు. 2003 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాలు వెనుకబడిన రాష్ట్రమనే నానుడిని తొలగించడంలో విజయం సాధించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల రాష్ట్రం వెనుకబడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు 2003లో మంచి నిర్ణయం తీసుకుని బీజేపీని గెలిపించారని చెప్పారు.

మధ్య ప్రదేశ్‌లో 2003 నుంచి 2023 వరకు బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలతో ఓ రిపోర్ట్ కార్డును అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, స్వయం సమృద్ధ రాష్ట్రంగా మధ్య ప్రదేశ్‌ను తీర్చిదిద్దడం కోసం గడచిన ఇరవయ్యేళ్లలో బీజేపీ ప్రభుత్వాలు బలమైన పునాదిని వేశాయని చెప్పారు. రాష్ట్రాన్ని దాదాపు 50 ఏళ్లపాటు పరిపాలించిన కాంగ్రెస్ కూడా తాను సాధించిన విజయాలతో ఓ రిపోర్డ్ కార్డును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్య ప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది చివర్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతోపాటు రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

China Occupation : ఇలా ఎవరూ మాట్లాడకూడదు.. రాహుల్ గాంధీపై మండిపడ్డ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సంజయ్..

Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..

ABN ఛానల్ ఫాలో అవ్వండి
Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-20T19:00:57+05:30 IST