Madras IIT: మద్రాస్‌ ఐఐటీలో వర్జీనియా టెక్‌ విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రం

ABN , First Publish Date - 2023-02-19T10:32:06+05:30 IST

మద్రాస్‌ ఐఐటీ(Madras IIT)లో వర్జీనియా టెక్‌ విశ్వవిద్యాలయం పరిశోధనా, అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో మద్రాస్‌ ఐఐటీ,

Madras IIT: మద్రాస్‌ ఐఐటీలో వర్జీనియా టెక్‌ విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రం

చెన్నై, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మద్రాస్‌ ఐఐటీ(Madras IIT)లో వర్జీనియా టెక్‌ విశ్వవిద్యాలయం పరిశోధనా, అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో మద్రాస్‌ ఐఐటీ, వర్జీనియా వర్శిటీ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించనున్నాయి. ఈ కేంద్రాన్ని వర్జీనియా టెక్‌ వర్శిటీ పరిపాలనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ సిరిల్‌ క్లార్క్‌, అంతర్జాతీయ వ్యవహారాల ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గురుకోష్‌, ప్రొఫెసర్లు అసిమ్‌ ఎస్‌కాండ్రియన్‌, నికోలస్‌, రేటెక్కా, డాన్‌ సూయ్‌, ప్రొఫెసర్‌ విశ్వనాఽథ్‌ వెంకటేష్‌ తదితరులు లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ వర్శిటీ కేవలం విద్య మాత్రమే కాకుండా పరిశోధనలు కూడా చేపడుతోందని, ఇందులో భాగంగా మద్రాస్‌ ఐఐటీలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2023-02-19T10:32:07+05:30 IST