Meghalaya Results : మేఘాలయలో రసవత్తర పోరు... టీఎంసీ జోరు...
ABN , First Publish Date - 2023-03-02T09:50:10+05:30 IST
మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, ఎన్‌పీపీ,
న్యూఢిల్లీ : మేఘాలయ శాసన సభ ఎన్నికల్లో (Meghalaya Assembly Elections) పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఎన్‌పీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, యూడీపీ నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 9:32 గంటలకు అందిన సమాచారం ప్రకారం , ఎన్‌పీపీ 25, బీజేపీ 8, యూడీపీ 5, టీఎంసీ 11, కాంగ్రెస్ 7, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు టీఎంసీ గట్టి ఝలక్ ఇచ్చింది. కొందరు కాంగ్రెస్ నేతలు ఇటీవల ఆవేదన వ్యక్తం చేసినట్లుగానే టీఎంసీ వల్ల ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది.
మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, ఎన్‌పీపీ, బీజేపీ జట్టు కడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోంది.
మేఘాలయలో పోటీ తీవ్రంగా ఉంటుందని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అయిన ఎన్‌పీపీ ఆధిక్యతను నిలబెట్టుకున్నప్పటికీ, వేరుగా పోటీ చేసిన బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుంటే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలనుబట్టి వెల్లడవుతోంది.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..