Governor Haribabu: మణిపూర్‌లో త్వరలోనే శాంతి వికసిస్తుంది
ABN , First Publish Date - 2023-08-14T03:06:20+05:30 IST
మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, త్వరలోనే మళ్లీ శాంతి వికసిస్తుందని మిజోరం గవర్నర్ హరిబాబు అన్నారు.

‘ఆంధ్రజ్యోతి’తో మిజోరం గవర్నర్ హరిబాబు
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, త్వరలోనే మళ్లీ శాంతి వికసిస్తుందని మిజోరం గవర్నర్ హరిబాబు అన్నారు. మిజోరం రాజధాని ఐజాల్ నుంచి ఆయన ఆదివారం ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధితో మాట్లాడారు. మణిపూర్ అంశంలో కేంద్రం చేతులు ముడుచుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇటీవల కుకీలతో కూడా మాట్లాడారని తెలిపారు. ఏ చర్యలు తీసుకుంటే ఇరు వర్గాలు శాంతిస్తాయన్న విషయంపై అనేక ప్రతిపాదనలు వచ్చాయని హరిబాబు చెప్పారు. స్వతంత్ర పరిపాలనా వ్యవస్థలు ఏర్పాటు చేయడం లాంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.