Rahul Gandhi: రాహుల్ గాంధీని హతమారుస్తానని బెదిరించిన నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2023-04-28T18:46:48+05:30 IST

మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అడుగుపెట్టగానే బాంబులు వేస్తామని బెదిరిస్తూ లేఖ పంపిన..

Rahul Gandhi: రాహుల్ గాంధీని హతమారుస్తానని బెదిరించిన నిందితుడి అరెస్ట్

కాంగ్రెస్ అధినేత(Cogress Leader) రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బెదిరింపు లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అడుగుపెట్టగానే బాంబులు వేస్తామని బెదిరిస్తూ లేఖ పంపిన దయాసింగ్ (60) అనే వ్యక్తిని జాతీయ భద్రతాచట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

గత ఏడాది భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోకి ప్రవేశించడానికి ముందు కాంగ్రెస్ అధినేత(Cogress Leader) రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ రాశారు. గతేడాది నవంబర్‌లో ఇండోర్‌లోని ఓ స్వీట్ షాప్ బయట ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేరోజు గుర్తు తెలియని ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో 60 ఏళ్ల దయాసింగ్‌‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రైలులో పారిపోబోతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్‌ను పట్టుకున్నారు. దయాసింగ్‌ను జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ పంపాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) నిమిష్ అగర్వాల్ తెలిపారు.

Updated Date - 2023-04-28T18:46:48+05:30 IST