Amritpal Singh: కేంద్ర భద్రతా బలగాల హై అలర్ట్

ABN , First Publish Date - 2023-03-23T12:15:38+05:30 IST

ఖలిస్థానీ మద్ధతుదారు అయిన అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి....

Amritpal Singh: కేంద్ర భద్రతా బలగాల హై అలర్ట్
Amritpal Singh

న్యూఢిల్లీ : ఖలిస్థానీ మద్ధతుదారు అయిన అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh)కార్యకలాపాలపై కేంద్ర భద్రతా ఏజెన్సీలు గురువారం హైఅలర్ట్ ప్రకటించాయి. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు సింగ్ పై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అమృత్ పాల్ సింగ్ మహారాష్ట్రతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండవచ్చనే సమాచారం మేర కేంద్ర దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. అమృతపాల్ సింగ్ పై మహారాష్ట్ర పోలీసులు గత 6 రోజులుగా గాలిస్తున్నారు. రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నాందేడ్ జిల్లాకు వచ్చే, పోయే ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్... సూరత్ కోర్టు సంచలన తీర్పు

ఖలిస్తానీ నేతను పట్టుకునేందుకు మహారాష్ట్ర ఏటీఎస్ కూడా అప్రమత్తమైంది. అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు చేపట్టిన భారీ వేట గురువారం ఆరో రోజుకు చేరినా ఆయన పరారీలో ఉన్నాడు. అమృతపాల్‌ను గుర్తించడంలో ప్రజలు సహాయం చేస్తారని ఆశతో పంజాబ్ పోలీసులు మంగళవారం అమృతపాల్ ఏడు వేర్వేరు చిత్రాలు విడుదల చేశారు. అతని కుటుంబాన్ని విచారించేందుకు పంజాబ్ పోలీసులు బుధవారం అమృత్‌సర్‌లోని అమృత్‌పాల్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. అతని తల్లిని కూడా పోలీసు అధికారులు ప్రశ్నించారు.బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ వద్ద 200 మందికి పైగా ఖలిస్తానీ మద్దతుదారులు నిరసనకు దిగారు.

Updated Date - 2023-03-23T12:15:38+05:30 IST