Share News

Chhattisgarh: మావోయిస్టులకు గట్టి దెబ్బ

ABN , Publish Date - Mar 17 , 2025 | 10:03 PM

Chhattisgarh: మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతోన్నాయి. తాజాగా వారికి మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో 19 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోాయిరు. వారిపై రూ. 29 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

Chhattisgarh: మావోయిస్టులకు గట్టి దెబ్బ

రాయ్‌పూర్, మార్చి 17: కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టడం మావోయిస్టులకు వరుస ఎదుర దెబ్బలు తగులుతోన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం 19 మంది మావోయిస్టులు లొంగిపోయిన్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరిపై 29 లక్షల రివార్డు ఉందని తెలిపారు. సౌత్ బస్తర్ డివిజన్‌తోపాటు పామెడ్ ఏరియా కమిటీకి చెందిన 10 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారని వివరించారు. అయితే వీరంతా మూడు దశబ్దాలుగా మావోయిస్ట్ కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.

2026, మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొంది. అందులోభాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లేకుండా పోయారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించిన దండకారణ్యంలో మాత్రం వారి ప్రాబల్యం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, భద్రత సిబ్బంది సంయుక్తంగా మావోయిస్టుల కోసం కూబింగ్ నిర్వహిస్తున్నారు.


దీంతో భద్రతా దళాలు తారస పడిన వేళ.. వారిపై కాల్పులకు మావోయిస్టులు తెగ బడుతున్నారు. దాంతో భారీగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఇంకోవైపు వందలాది మంది మావోయిస్టులు సైతం పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అంతేకాదు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం లోంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. వారి పునరావాసానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతోందని ఆయన వివరించిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 17 , 2025 | 10:03 PM