Red Banana: మార్కెట్లో ఎర్రటి అరటిపండ్లను చూసే ఉంటారు కానీ.. అసలు మామూలు వాటికీ.. వీటికీ తేడా ఏంటన్నది తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-06-01T15:39:23+05:30 IST
పసుపు అరటిపండ్లలాగే, ఈ అరటిపండ్లు రుచిలో తియ్యగా ఉంటాయి.

అరటిపండ్లు మామూలుగా అందరి ఇళ్ళల్లోనూ ఇవి కనిపిస్తూనే ఉంటాయి. చాలావరకూ అరటిపండు ఆరోగ్యానికి మంచిదని, పిల్లలకు, పెద్దలకు బలాన్నిస్తుందని రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటాం. దానికి తగ్గట్టుగానే ధర విషయంలోనూ అరటి పండు పెద్దగా రేటు లేకపోవడం వల్ల పేదలు, ధనికులు, మధ్యతరగతివారు అంతా అరటి పండును తినగలుగుతున్నారు. ఏదైనా పర్వదినాలప్పుడు, ప్రత్యేక సంధర్భాలు పెళ్ళి, పేరంటాల్లో కూడా అరటిపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక అరటిపండులో చాలా రకాలున్నా మనకు అందులో బాటులో ఉండేవి కొన్నిమాత్రమే.
1. ఎర్ర అరటిపండు ప్రయోజనాలు: పసుపు అరటిపండు కంటే ఎర్రటి అరటిపండులో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
2. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
3. ఎర్ర అరటి పండు లక్షణం ఏమిటంటే, దాని పై తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. లోపలి భాగం పసుపు అరటిపండులా తెల్లగా ఉంటుంది.
4. ఈ అరటిపండు అతిపెద్ద ఉత్పత్తి ఆగ్నేయాసియాలో ఉంది. పసుపు అరటిపండ్లలాగే, ఈ అరటిపండ్లు రుచిలో తియ్యగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: పాలల్లో చపాతీలను ముంచుకుని తినడం మంచిదేనా..? ఈ అలవాటు ఉన్నవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..!
5. డయాబెటిక్ పేషెంట్లు కూడా ఎర్ర అరటిపండు తినవచ్చు. ఎర్ర అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
6. ఈ పండుని రోజూ పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
7. ఎర్ర అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఈ అరటిపండును ఎలాంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు.
8. కంటి చూపు బలహీనంగా ఉన్నవారు కూడా ఈ అరటిపండును తినాలి. ఎందుకంటే ఎర్ర అరటిపండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
9. ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
10. ఈ అరటిపండు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.