junk food: జంక్‌ ఫుడ్‌తో జర భద్రం!

ABN , First Publish Date - 2023-08-17T03:03:31+05:30 IST

మీ పిల్లలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే జంక్‌ ఫుడ్‌ మాన్పించి, బదులుగా పళ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినిపించాలి. ఇందుకోసం జంక్‌ ఫుడ్‌ పట్ల మీ పిల్లలకు అవగాహన ఏర్పరిచే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాయామానికి దైనందిన జీవితంలో చోటు కల్పించండి.

 junk food: జంక్‌ ఫుడ్‌తో జర భద్రం!

కౌన్సెలింగ్‌

మీ పిల్లలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే జంక్‌ ఫుడ్‌ మాన్పించి, బదులుగా పళ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినిపించాలి. ఇందుకోసం జంక్‌ ఫుడ్‌ పట్ల మీ పిల్లలకు అవగాహన ఏర్పరిచే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాయామానికి దైనందిన జీవితంలో చోటు కల్పించండి.

డాక్టర్‌! మా పిల్లలు కాలేజీ విద్యార్థులు. విపరీతంగా జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందేమోనని భయంగా ఉంది. వాళ్ల చేత ఈ అలవాటును మాన్పించేదెలా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

కంటికి ఇంపుగా, ఘుమఘమలాడుతూ, నోట్లో నీళ్లూరించే ఆ ఆహారంలో క్యాలరీలు ఎక్కువే! అయితే ఈ క్యాలరీలన్నీ హాని కలిగించే కొవ్వులు, చక్కెరల నుంచే వస్తాయి. రెడీ టు ఈట్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు... ఇవన్నీ జంక్‌ ఫుడ్‌లో భాగాలే! వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు.

హృద్రోగాలు:

జంక్‌ ఫుడ్‌లో ఉండే ట్రాన్స్‌ మరియు శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ధమనులు మూసుకుపోయేలా చేసి దీర్ఘకాలంలో అధిక మొత్తంలో కొలెస్టరాల్‌ పెరిగిపోయేలా చేస్తాయి. వారానికి కనీసం నాలుగుసార్లు జంక్‌ఫుడ్‌ తినేవాళ్లు మరణించే అవకాశాలను 80ు పెంచుకున్నట్టు అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

స్థూలకాయం:

కౌమారంలో సక్రమమైన ఆహారపుటలవాట్లు పాటించని పిల్లలు స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉంది. అవసరానికి మించి బరువు పెరిగే అది ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. జంక్‌ ఫుడ్‌లో బరువును పెంచే కేలరీలు, చక్కెరలకు కొదవుండదు. జంక్‌ ఫుడ్‌ తినేవాళ్లు పళ్లు, కూరగాయలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఫలితంగా పోషకాల కొరత వల్ల వ్యాధినిరోధకశక్తి కూడా సన్నగిల్లుతుంది.

కడుపులో పుండు:

జీర్ణనాళంలో తలెత్తే వ్యాధి (పెప్టిక్‌ అల్సర్‌) ఇది. క్షార గుణం కలిగిన ఈ రుగ్మత విపరీతమైన నొప్పినీ కలిగిస్తుంది. కారం, నూనెలు, మసాలాలు, ఉప్పు కలిసిన ఆహారం తినడం, ఒత్తిడి కలిగి ఉండడం మూలంగా ఈ రుగ్మత తలెత్తుతుంది.

మధుమేహం:

ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పట్టున వంట చేసుకునే సమయం కొందరికి ఉండకపోవచ్చు. దాంతో హోటళ్లు, బేకరీల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి ఉద్యోగం ఎప్పుడూ అడ్డంకి కాకూడదు. క్రమం తప్పక జంక్‌ ఫుడ్‌ తీసుకుంటూ క్రమం తప్పిన జీవనశైలి కలిగినవాళ్లు, అదే సమయంలో వ్యాయామం సైతం లోపించినవాళ్లు కచ్చితంగా స్థూలకాయులవుతారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలంలో టైప్‌2 మధుమేహానికి దారి తీస్తుంది.

Updated Date - 2023-08-17T03:03:31+05:30 IST