రావణ పాత్రలో యశ్

ABN , First Publish Date - 2023-01-28T23:53:28+05:30 IST

ఒక్క సినిమా చాలు నటుడి జాతకం మారిపోవడానికి. ఒక్క సినిమా చాలు ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోవడానికి. కన్నడ హీరో యశ్‌ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ‘కేజీఎఫ్‌’ చిత్రానికి ముందు అతనెవరో చాలా మందికి తెలియదు. కొన్ని చిత్రాల్లో

రావణ పాత్రలో యశ్

ఒక్క సినిమా చాలు నటుడి జాతకం మారిపోవడానికి. ఒక్క సినిమా చాలు ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోవడానికి. కన్నడ హీరో యశ్‌ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ‘కేజీఎఫ్‌’ చిత్రానికి ముందు అతనెవరో చాలా మందికి తెలియదు. కొన్ని చిత్రాల్లో నటించడం వల్ల కన్నడ ప్రేక్షకులకు మాత్రం కొద్దిగా తెలుసు. కానీ ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాలతో ఓవర్‌నైట్‌ ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యారు. బాలీవుడ్‌ బాక్సాఫీసు దగ్గర ఈ రెండు చిత్రాలూ రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు సాధించి, సంచలన విజయం సాధించడంతో పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు. దాంతో అన్ని భాషల నుంచీ ఆయన డేట్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. అయితే కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో యశ్‌ ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రం తర్వాత చేయబోయే సినిమా ఎలా ఉండాలనే విషయంలో ఆయనకు ఓ అవగాహన ఉంది. కథలు వింటున్నారు కానీ ఏదీ ఇంకా ఫైనలైజ్‌ చెయ్యలేదు. ఇప్పటికే కరణ్‌ జోహార్‌ ‘బ్రహ్మాస్త్ర 2’లో దేవ్‌ పాత్ర చేయమని యశ్‌ను అడిగారు. దానికి కూడా యశ్‌ తన అంగీకారాన్ని తెలపలేదు. కాకపోతే నాలుగైదు కథలను దాదాపుగా ఓకే చేసినట్లేనని యశ్‌ సన్నిహిత వర్గాల సమాచారం. వీటిల్లో దర్శకుడు నితీశ్‌ తివారి రామాయణ సినిమా ఒకటని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పీర విజువలైజేషన్‌ చూసి యశ్‌ థ్రిల్‌ ఫీలయ్యారనీ, ఇప్పుటికే టీమ్‌తో పలు సార్లు సమావేశమయ్యారనీ తెలిసింది. అన్నీ కుదిరితే ఈ సినిమాలో యశ్‌ రావణుడి పాత్ర పోషించవచ్చని అంటున్నారు. ‘రామాయణ’ కథతో పాటు ఓ జంగిల్‌ అడ్వెంచర్‌, ఒక సై ఫై కథ, గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథ యశ్‌ పరిశీలనలో ఉన్నాయి. ‘రామాయణ’ చిత్రం విషయానికి వస్తే 2019 లో అల్లు అరవింద్‌, మధు మంతెన నిర్మాతలుగా నితిశ్‌ తివారి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. శ్రీరాముడి పాత్ర కోసం రణ్‌బీర్‌ కపూర్‌ను సంప్రదించింది టీమ్‌. ఆ పాత్ర చేయడానికి రణ్‌బీర్‌ కూడా ఆసక్తి చూపించారు. యశ్‌ రావణుడి పాత్ర చేయడానికి అంగీకరిస్తే వేసవిలో షూటింగ్‌ ప్రారంభించాలని నితీశ్‌ అనుకుంటున్నారు.

Updated Date - 2023-01-28T23:53:29+05:30 IST