Indian Worker: సింగపూర్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో భారతీయ కార్మికుడు దుర్మరణం!
ABN , First Publish Date - 2023-07-14T09:18:36+05:30 IST
సింగపూర్ ( Singapore ) లో విషాద ఘటన జరిగింది.
సింగపూర్ సిటీ: సింగపూర్ ( Singapore ) లో విషాద ఘటన జరిగింది. అక్కడి జురాంగ్ వెస్ట్ ఇండస్ట్రియల్ రీజియన్‌లోని ఓ వర్క్‌సైట్ (Work Site) లో టిప్పర్ వాహనం రివర్స్ చేస్తూ ఢీకొట్టడంతో భారతీయ కార్మికుడు (Indian Worker) దుర్మరణం చెందాడు. మృతుడు టిప్పర్ ట్రక్కును అన్‌లోడ్ చేయడానికి సిద్దం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో నిర్మాణ ప్రదేశాలలో భారీ వస్తువులను ఎత్తడానికి ఉపయోగించే రివర్సింగ్ వీల్ లోడర్ అతడ్ని ఢీకొట్టినట్లు బుధవారం సింగపూర్ మానవవనరుల మంత్రిత్వ శాఖ (Ministry of Manpower) వెల్లడించింది. మృతుడిని బీఎస్ఎన్ టెక్ ఇంజనీరింగ్ (BSN Tech Engineering) లో పనిచేసే డ్రైవర్‌గా గుర్తించారు. ఇతను స్టార్ రెడీ మీక్స్ సైట్ (Star Ready Mix) లో పనిచేస్తున్నాడు.
సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్, పారామెడిక్ ఏజెన్సీలు భారతీయ కార్మికుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 3.40 గంటకు ఫస్ట్ బురో క్లోజ్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టినా ప్రభుత్వాధికారులు ఘటనాస్థలిలో అన్ని వాహనాల కార్యకలాపాలను నిలిపివేయాలని స్టార్ రెడీ మిక్స్ సైట్ వారిని ఆదేశించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?
కాగా, వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ (Workplace Safety and Health) చట్టాలను ఉల్లంఘించినా సందర్భంలో మరణం లేదా తీవ్రమైన గాయానికి కారణమైతే గతంలో విధించే 20 వేల సింగపూర్ డాలర్ల (రూ.12.43లక్షలు) జరిమానాను 50వేల సింగపూర్ డాలర్లకు (రూ. 31.09లక్షలు) పెంచడం జరిగింది. ఇక సింగపూర్‌లో జూన్ 21 నాటికి వర్క్‌సైట్లలో 14 మంది చినిపోయారు. 2022లో ఈ సంఖ్య 46గా ఉంటే.. 2016లో మాత్రం అత్యధికంగా 66 మంది మృతిచెందారు.