US Visas: ఇండియాలో బాగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. ఇక అమెరికా వీసా చాలా ఈజీ!
ABN , First Publish Date - 2023-03-30T07:32:18+05:30 IST
అమెరికా వీసా దరఖాస్తుల ఆమోదానికి ముందు జరిపే ఇంటర్వ్యూలకు పట్టేకాలం భారతదేశంలో బాగా తగ్గింది.
వాషింగ్టన్, మార్చి 29: అమెరికా వీసా దరఖాస్తుల ఆమోదానికి ముందు జరిపే ఇంటర్వ్యూలకు పట్టేకాలం భారతదేశంలో బాగా తగ్గింది. సాధారణంగా తీసుకునే సమయంతో పోల్చితే ఈ ఏడాది సరాసరి 60 శాతం మేర అది తగ్గినట్టు అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జూలియా స్టఫ్ట్ తెలిపాకె, కొత్తగా దౌత్య కార్యాలయాల ఏర్పాటు, భారత్‌లో పనిచేస్తున్న దౌత్యాధికారుల సంఖ్యను పెంచడం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి వంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. దరఖాస్తుల పరిష్కారానికి సమయాన్ని తగ్గించడమే ఈ చర్యలన్నింటి లక్ష్యమన్నారు. ఇదిలా ఉండగా, హెచ్1-బీ, ఎల్-1 వీసాల జారీ వ్యవస్థలో సంస్కరణలను కోరుతూ కొందరు సెనేటర్లు కాంగ్రె్‌సలో తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలు, మోసాలను అరికట్టి, ఈ ప్రక్రియను పారదర్శకం, పటిష్ఠవంతం చేయాలని వారు కోరారు.
ఇది కూడా చదవండి: హెచ్1బీ వీసా కోటా పూర్తి.. అర్హులైన వారు తదుపరి చర్యలు ప్రారంభించుకోవచ్చు..