Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?

ABN , First Publish Date - 2023-07-22T18:48:06+05:30 IST

మాగంటి గోపినాథ్ (Maganti Gopinath).. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఈ పేరు తెలియని వారుండరేమో! ఎందుకంటే.. హైదరాబాద్‌లోని (Hyderabad) అత్యంత ధనికులున్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ (Jubilee Hills).!. సినీ నటులు (Cine Actors), వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నేతలు, బిలియనీర్లు, సెటిలర్స్, పేదలూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు.! ఇక్కడ్నుంచి మాగంటి (Maganti) ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అందరికీ తెలిసే ఉంటుంది..

Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఔటేనా.. టికెట్ కోసం ఇద్దరు పోటాపోటీ.. కేటీఆర్ ఆశీస్సులు ఎవరికో..!?

మాగంటి గోపినాథ్ (Maganti Gopinath).. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఈ పేరు తెలియని వారుండరేమో! ఎందుకంటే.. హైదరాబాద్‌లోని (Hyderabad) అత్యంత ధనికులున్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ (Jubilee Hills).!. సినీ నటులు (Cine Actors), వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నేతలు, బిలియనీర్లు, సెటిలర్స్, పేదలూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు.! ఇక్కడ్నుంచి మాగంటి (Maganti) ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అందరికీ తెలిసే ఉంటుంది. 2014లో టీడీపీ (TDP) తరఫున గెలిచి పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతూనే ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమై గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ (BRS) తరఫునే పోటీచేసి గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో మాగంటికి టికెట్ కష్టమేనని.. ఇందుకు చాలా లెక్కలే ఉన్నాయని తెలుస్తోంది. గోపీనాథ్‌ను కాకుండా మరో ఇద్దర్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఇద్దరూ ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా టికెట్ కోసం పోటీ పడుతున్నారని తెలియవచ్చింది. ఇంతకీ మాగంటిని గులాబీ సర్కార్ (KCR Govt) నిజంగానే పక్కనెడుతోందా..? ఈ టికెట్ (BRS Ticket) కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు..? ఇంతకీ గోపీనాథ్ మీద ఎందుకింత నెగిటివ్ ప్రచారం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


Maganti.jpg

ఇదీ అసలు కథ..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ సిట్టింగుల్లో టికెట్ గుబులు మొదలైంది.! సుమారు 20 నుంచి 35 మంది సిట్టింగులను గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) మార్చే అవకాశాలున్నాయనట. దీంతో ఆ జాబితాలో ఎవరున్నారు..? అనేది పూర్తిగా తెలియట్లేదు కానీ.. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నట్లు తెలియవచ్చింది. ఒకటికి రెండుసార్లు సర్వే చేయించినా మాగంటి గురించి నెగిటివ్‌గానే వచ్చిందట. దీనికి గల కారణాలేంటని ఆరాతీస్తే.. వివాదాలేనని తేలిందట. మాగంటి ముఖ్య అనుచరుల ఆగడాలు, పీఏ అరాచకాలు, వ్యక్తిగతంగా జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్‌తో గొడవలు, కొన్ని వివాదాల్లో స్వయంగా ఎమ్మెల్యేనే జోక్యం చేసుకోవడం, కార్పొరేటర్లతో వివాదాలు, గొడవలు.. ఇవన్నీ మైనస్‌లుగా ఉన్నాయట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వరుసగా రెండుసార్లు గెలవడంతో సర్వసాధారణంగా వ్యతిరేకత కూడా వచ్చిందట. ముఖ్యంగా సర్వేలో ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీలోని కొంత భాగం, షేక్‌పేట ఈ ఐదు ప్రాంతాల్లో సగానికి సగం మంది ప్రజలు మాగంటికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని.. రెండు టర్మ్‌లు ఎమ్మెల్యేగా ఉన్న సక్రమంగా ఏ పనీ చేసింది లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారట. రోడ్లు, డ్రైనేజీ విషయంలో ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతుండటం గమనార్హం. అయితే.. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఒప్పించి టికెట్ దక్కించుకోవాలని.. హ్యాట్రిక్ కొడతానని తనకు మాత్రం నమ్మకమే ఉందని మాగంటి తన ఆప్తులతో చెబుతున్నారట.

Maganti-Gopinath.jpg

పోటీ పడుతున్నదెవరు..?

ఈ సర్వే వ్యవహారం బయటికి రావడంతో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ (Baba Fasiuddin), రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) టికెట్ కోసం బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ప్రదిక్షణలు చేయడం మొదలెట్టేశారట. బాబాకు ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండలో మంచి పట్టుంది. ఇక ఎలాగో షేక్‌పేటలో సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో బలనిరూపణ చేసుకుని అయినా సరే టికెట్ దక్కించుకోవాలని ఆయన ఉన్నారట. అవసరమైతే ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీతో (Asaduddin Owaisi) కూడా రెకమెండేషన్ పెట్టించాలనే యోచనలో ఉన్నారట. కేసీఆర్‌తోనే ఈయనకు డైరెక్టుగా పరిచయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఎంఐఎం తరఫున దాదాపు అభ్యర్థి నిలిచే ఛాన్స్ ఉండదు. ఒకవేళ నిలిపినా డమ్మీలాగే ఉంటారట. 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున నవీన్ యాదవ్ (Naveen Yadav) పోటీచేసి.. టీడీపీ తరఫున పోటీచేసిన మాగంటిని ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి 50,898 ఓట్లతో గెలవగా.. ఎంఐఎం (AIMIM) 41,656 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి తాను పోటీచేస్తే ఇటు బీఆర్ఎస్.. అటు సొంత సామాజిక వర్గం అండదండలతో సులువుగా గెలవచ్చన్నది ఫసియుద్ధీన్ ప్లానట.

Baba-and-Ravula.jpg

- ఇక రావుల శ్రీధర్ రెడ్డి విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసిన ఈయన 8,517 ఓట్లకే పరిమితం అయ్యారు. అయితే మంచి వాక్చాతుర్యం, డిబెట్స్‌లో ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో దిట్ట. అయితే కొన్ని వర్గవిబేధాలతో, మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో కమలానికి గుడ్ బై చెప్పేసి.. కారెక్కేశారు. ఆ తర్వాత తెలంగాణ విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టింది. అయితే.. ఎప్పటికైనా సరే జూబ్లీహిల్స్‌కు ఎమ్మెల్యే కావాలన్నది రావుల చిరకాల కోరికట. అందుకే బీఆర్ఎస్ తరఫున ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కేటీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారట. సరిగ్గా ఇదే సమయంలో మాగంటికి వ్యతిరేకంగా సర్వేల్లో తేలడంతో తనను బరిలోకి దింపాలని కోరుతున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరే బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం ‘నువ్వా-నేనా’ అనే రేంజ్‌లో పోటీ పడుతున్నారట.

BRS.jpg

ప్రతిపక్షాల నుంచి ఇలా..?

కాంగ్రెస్‌ నుంచి దివంగత నేత పీజేఆర్ (PJR) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy), కుమార్తె విజయారెడ్డి (Vijaya Reddy) ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ వీలుకాని పక్షంలో తనకు ఖైరతాబాద్ ఇచ్చి తీరాల్సిందేనని విజయారెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలియవచ్చింది. ఇక బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలియవచ్చింది. గతంలో టీడీపీలో పనిచేసిన లంకాలకు నియోజకవర్గంలో చాలావరకు మంచి పరిచయాలు, గుర్తింపు కూడా ఉంది. ఈసారి టికెట్ దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి రెడ్డి (Keerthi Reddy) కూడా నియోజకవర్గంలో యమా యాక్టివ్‌గా తిరుగుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యలను తెలుసుకుని తన సొంత సొమ్ముతో పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) , మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఇద్దరి అండ తనకుందని.. కచ్చితంగా టికెట్ వస్తుందని ధీమాతో కీర్తిరెడ్డి ఉన్నారట.

Keerthi-Visnu-Jaya-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. బీఆర్ఎస్ టికెట్ కోసం మాగంటి కేసీఆర్‌తో, అసదుద్ధీన్‌తో బాబా, కేటీఆర్‌తో రావుల ముగ్గురు వేర్వేరు రూట్లలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి అధిష్టానం మనసులో ఎవరున్నారో.. ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఒక్క బీఆర్ఎస్‌లోనే కాదు.. కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫైనల్‌గా గులాబీ బాస్ టికెట్ ఎవరికిస్తారు..? అత్యంత ధనికులున్న జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీ ఎగురుతుంది..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.


ఇవి కూడా చదవండి


Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?


Telangana BJP : కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సాక్షిగా బీజేపీలో బయటపడిన లుకలుకలు.. అంతా గందరగోళం..!


TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!


TS Politics : గజ్వేల్‌కు గులాబీ బాస్ గుడ్ బై చెప్పేస్తున్నారా.. పరిశీలనలో రెండు నియోజకవర్గాలు.. ఆ సర్వే తర్వాత మారిన సీన్..!?




Updated Date - 2023-07-22T18:54:33+05:30 IST