Ashok Gajapathi Raju: అశోక్ లోక్‌సభకా.. అసెంబ్లీకా..? మనసులో మాటను చంద్రబాబుకు చెప్పినట్టేనా..?

ABN , First Publish Date - 2023-07-19T21:22:26+05:30 IST

అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో ఓడిన చోటే బరిలోకి దిగుతానని అధినేత ముందు మనసులో మాటను బయటపెట్టినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం మాత్రం అశోక్‌ గజపతిరాజును అసెంబ్లీ బరిలో దించితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అశోక్‌ గజపతిరాజు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడే వ్యక్తి. ఒకవేళ లోక్‌సభకు అశోక్‌ గజపతిరాజు పోటీ చేస్తే విజయనగరం అసెంబ్లీ బరిలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, కనకమహాలక్ష్మీ, మీసాల గీత పేర్లు పరిశీలనకు రావచ్చునన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Ashok Gajapathi Raju: అశోక్ లోక్‌సభకా.. అసెంబ్లీకా..? మనసులో మాటను చంద్రబాబుకు చెప్పినట్టేనా..?

(విజయనగరం రూరల్‌)

టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు ఈ పర్యాయం అసెంబ్లీకి పోటీ చేస్తారా? లోక్‌సభకు పోటీ చేస్తారా? అన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్టే. తన మనసులో మాటను అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఆరు నెలలుగా విజయనగరం నియోజకవర్గంలో ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నా నియోజకవర్గ ఇన్‌చార్జి ఎవరన్నది చెప్పలేని పరిస్థితి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇంటిలిజెన్స్‌ ద్వారా ఈ విషయాన్ని అంచనావేసిన పార్టీ అధినేత చంద్రబాబు నుంచి అశోక్‌ గజపతిరాజుకు ఇటీవల పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఆది, సోమవారాలు అధినేతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయనగరం పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నదానిపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.


ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒకట్రెండు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు ఎవరన్నది స్పష్టత వచ్చింది. కాగా అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో ఓడిన చోటే బరిలోకి దిగుతానని అధినేత ముందు మనసులో మాటను బయటపెట్టినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం మాత్రం అశోక్‌ గజపతిరాజును అసెంబ్లీ బరిలో దించితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అశోక్‌ గజపతిరాజు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడే వ్యక్తి. ఒకవేళ లోక్‌సభకు అశోక్‌ గజపతిరాజు పోటీ చేస్తే విజయనగరం అసెంబ్లీ బరిలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, కనకమహాలక్ష్మీ, మీసాల గీత పేర్లు పరిశీలనకు రావచ్చునన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-07-19T21:23:19+05:30 IST