NCBN Arrest : FIR లో ఎక్కడా కనిపించని చంద్రబాబు పేరు.. కొద్దిసేపటి క్రితమే..?
ABN , First Publish Date - 2023-09-10T08:33:51+05:30 IST
తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య విపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (TDP Chief Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ అధికారులు (CID) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..
తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య విపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (TDP Chief Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ అధికారులు (CID) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రంతా చంద్రబాబుకు నిద్రపోయే అవకాశమే లేకుండా అటు పోలీసులు.. ఇటు సీఐడీ అధికారులు 24 గంటలపాటు వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచడం తప్పనిసరి కావడంతో హుటాహుటిన ఆదివారం ఉదయాన్నే ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో (FIR) చంద్రబాబు పేరు లేకపోవడంతో మెమో దాఖలు చేసింది సీఐడీ.
అప్పుడు లేదు.. కొద్దిసేపటి క్రితమే..?
వాస్తవానికి 2021లో ఎఫ్ఐఆర్‌లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. అయితే ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ (CID Remond Report) రిపోర్టు అందించగా.. కొద్దిసేపటి క్రితమే ఎఫ్ఐర్‌లో చంద్రబాబు పేరును చేర్చడం గమనార్హం. దీంతో సీఐడీ వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిమాండ్ రిపోర్టును ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా సేకరించింది. ఇందులో కీలక విషయాలు ఉన్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిన అంశాలనే రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగంపై అభియోగాలు సీఐడీ అభియోగాలు మోపింది. ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ ఆరోపించింది. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అధికారులు అభియోగాలు మోపారు. మొత్తం రూ.279 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు సీఐడీ.. కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంతో ఏపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.
రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏయే విషయాలు చెప్పింది..?
ఇంకొన్ని విషయాలు..!
కాగా.. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలను పూర్తిగా పరిశీలించకుండానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చె్న్నాయుడు కలిపి క్యాబినెట్ ముందు ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టారని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అభియోగం మోపింది. ఈ నోట్ ఫైల్‌ను యదాతధంగా ఆమోదించారని కూడా రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారని, నాటి చంద్రబాబు ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశారని సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు.. ఏసీబీ కోర్టులో వాదనలు మొదలయ్యాయి. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. వాడీవేడీగా వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ కోర్టు దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
రిమాండ్ రిపోర్టులో మరిన్ని ముఖ్యాంశాలు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మొత్తం 141 మంది సాక్షుల విచారణ
కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా పనులు
90శాతం ఖర్చు సిమెన్స్ కంపెనీ భరిస్తుందని క్యాబినేట్ లో అబద్దాలు చెప్పారు
జీవో నెంబర్ 4ను అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారు
కేబినెట్‌లో అత్యవసర అంశంగా టేబుల్ అజెండాలో ఈ అంశాన్ని తీసుకొచ్చారు
డీపీఆర్ ఆధ్రాంగా రూ.3281కోట్లకు ఆమోదం తెలిపారు
మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడానికి చంద్రబాబు, అచ్చెంనాయుడల పాత్ర ఉంది
నిందితులతో కలిసి చంద్రబాబు కుట్ర చేశారు
బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే సీఎం ఆదేశాలతో అప్పటి సీయస్ నిధులు విడుదల చేశారు
అప్పటి ఆర్ధిక శాఖ అధికారిగా ఉన్న సునీత మొత్తం నిధులు విడుదల చేయకుండా పైలెట్ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత నిధులు విడుదల చేయవచ్చని పేర్కొన్నారు.
సీఐడీ రిమాండ్ రిపోర్టులో లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబుకు డబ్బులు అందినట్లు పేర్కొన్న సీఐడీ
ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులను కూడా పేర్కొన్న సీఐడీ
ఈ రెండింటికీ లింక్ చేస్తూ రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను పేర్కొన్న సీఐడీ
పలు కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు డబ్బు తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో ఆరోపణ
ఇన్ కం ట్యాక్స్ కేసులో మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు మాజీ పీయస్ పెండ్యాల శ్రీనివాస్ కు 160 సిఆర్.పిసి కింద ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్న సీఐడీ
మనోజ్ వాసుదేవ్ సెప్టెంబర్ ఐదో తేదీన యూ.ఎ.ఇ కి , పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్ ఆరో తేదీన అమెరికాకు వెళ్లిపోయారని సీఐడీ రిపోర్టులో పేర్కొన్న అధికారులు
ఐటీ నోటీసులు అందుకున్న తర్వాత వీరు వెళ్లిపోయారని, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకే ఈ విధంగా వాళ్లు వెళ్లిపోయారని పేర్కొన్న రిమాండ్ రిపోర్టు
చంద్రబాబే వీళ్లిద్దరినీ కూడా తప్పించారని కూడా రిమాండ్ రిపోర్టులో ఆరోపణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ముఖ్యమైన నోట్ పైల్స్ అన్నీ కూడా మాయం చేశారని పేర్కొన్న సీఐడీ
ఇటీవల శిరీష్ షా ఇచ్చిన 164 స్టేట్ మెంట్ ద్వారా చంద్రబాబునాయుడు ను అరెస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొన్న సీఐడీ
ఈ మొత్తం కేసులో శిరీషా ఇచ్చిన సి.ఆర్.పి సీలోని 160 స్టేట్ మెంట్ కీలకంగా మారిందని పేర్కొన్న సీఐడీ
పది సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ కావడంతో చంద్రబాబును రిమాండ్ కు పంపించాలని కోరిన సీఐడీ
ఇన్నర్ రింగ్ రోడ్, జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్స్, అలైన్ మెంట్ మార్పు వంటి అంశాలను కూడా సీఐడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన
అలైన్ మెంట్ ను మార్చి, లింగమనేని సంస్థ ద్వారా క్రిడ్ ప్రోకో పొందారని చంద్రబాబు పై ఆరోపణలు
చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన ప్రజా సేవకుడి కిందకు వస్తారని, అందువల్ల ఆయనకు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసిన సీఐడీ
ఆర్ధిక నేరాలకు సంబంధించిన అంశాలు కావడంతో ఇందులో మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఐడీ
నంద్యాల నుంచి హెలికాప్టలో తీసుకు వస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు తిరస్కరించారని పేర్కొన్న సీఐడీ
సీఐడీ కార్యాలయానికి తీసుకు వచ్చే సమయంలో కూడా టీడీపీ క్యాడర్ పలు ప్రాంతాలలో చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుపడి ఆందోళనలు చేసిందని, చంద్రబాబు వైఖరికి ఇది నిదర్శనమని నివేదికలో పేర్కొన్న సీఐడీ