Viral: సీన్ రివర్స్.. పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయిన బంధువులు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-05-08T15:35:41+05:30 IST

సాధారణంగా వరుడి తరఫు వారు రకరకాల కారణాలు చెప్పి పీటల మీద పెళ్లి ఆపేసిన సందర్భాలు గురించి విని ఉంటాం. తగినంత మర్యాదలు చేయలేదనో, చెప్పిన సమయానికి కట్నం డబ్బులు ఇవ్వలేదనో వరుడి తరఫు వారు చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేస్తుంటారు.

Viral: సీన్ రివర్స్.. పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయిన బంధువులు.. అసలు కథేంటంటే..

సాధారణంగా వరుడి (Groom) తరఫు వారు రకరకాల కారణాలు చెప్పి పీటల మీద పెళ్లి (Marriage) ఆపేసిన సందర్భాలు గురించి విని ఉంటాం. తగినంత మర్యాదలు చేయలేదనో, చెప్పిన సమయానికి కట్నం డబ్బులు ఇవ్వలేదనో వరుడి తరఫు వారు చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ వధువు (Bride) ఓ షాకింగ్ కారణం చెప్పి పెళ్లి ఆపేసింది. వరుడి తరఫు వారు తనకు తగినంత బంగారం (Jewellery) ఇవ్వలేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసింది.

ఉత్తరప్రదేశ్ బన్వారీ గ్రామానికి చెందిన శ్యామ్ నారాయణ్ కుమార్తెకు మన్పూర్ గ్రామానికి చెందిన లాలా రామ్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఎలాంటి కట్నమూ తీసుకోకుండా వరుడు వివాహం చేసుకుంటున్నాడు. పెళ్లి రోజున వరుడి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లితంతు అట్టహాసంగా జరుగుతోంది. ఆ సమయంలో వధువు సూపర్‌ ట్విస్ట్ ఇచ్చింది.

Viral Video: కారులో 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టి చేతులతోనే ఎలా పట్టుకున్నాడో చూడండి..

వరమాల తర్వాత జరిగే ముఖ్యమైన క్రతువులో పాల్గొనాలంటే తను అడిగినంత బంగారం, బహుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వరుడి కుటుంబ సభ్యులు చాలా తక్కువ బంగారం తీసుకొచ్చారని, తాను అడిగినంత ఇస్తేనే పెళ్లి జరుగుతుందని స్పష్టం చేసింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులే కాదు.. ఆమె బంధువులు కూడా షాకయ్యారు. చివరకు వివాహం రద్దైంది. ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై మరొకరు కంప్లైంట్లు ఇచ్చారు. పోలీసులు వారి మధ్య సెటిల్‌మెంట్ చేసి ఎవరింటికి వారిని పంపించారు.

Updated Date - 2023-05-08T15:35:41+05:30 IST