Cat Viral Video: తల్లిని మరిపించిన పిల్లి.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:53 PM
ఓ పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్న పిల్లాడు చివరకు పాకుతూ వెళ్లి రెయిలింగ్ పట్టుకుని నిలబడతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న వారి పెంపుడు పిల్లి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

మానవత్వం మంటగలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో మనుషల కంటే జంతువులే నయమని చెప్పొచ్చు. కొన్నిసార్లు కొన్ని జంతువులు చేసే పనులే ఇందుకు నిదర్శనం. కొన్ని జంతువులు మనుషులను అనుకరిస్తుంటే.. మరికొన్ని జంతువులు మనుషులు చేయాల్సిన పనులను గుర్తు చేస్తుంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి పిల్లాడిని సంరక్షించే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా. ‘‘తల్లిని మరిపించిన పిల్లి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్న పిల్లాడు చివరకు పాకుతూ వెళ్లి రెయిలింగ్ పట్టుకుని నిలబడతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న వారి పెంపుడు పిల్లి.. పరుగెత్తుకుంటూ పిల్లాడి వద్దకు వెళ్తుంది.
పక్కనే ఉన్న టేబుల్‌పై కూర్చుని, (cat guarding child) పిల్లాడిని గమనిస్తూ ఉంటుంది. పిల్లాడు రెయిలింగ్‌కు ఉన్న ఇను రాడ్లు పట్టుకోవాలని చూడగానే.. పిల్లి వెంటనే అలెర్ట్ అయి చేతిని పక్కకు తీస్తుంది. ఇలా ఆ పిల్లాడు ఇనుప కాడ్లను పట్టుకున్న ప్రతి సారీ పిల్లి పక్కకు తీస్తుంటుంది. చివరకు పిల్లాడు రెండు చేతులతో రెయిలింగ్ పట్టుకుని వేలాడడంతో పిల్లి నేరుగా గోడ పైకి వెళ్తుంది. ‘‘ఇలా చేయొద్దు నాన్నా కిందపడిపోతావ్.. దూరంగా వెళ్లిపో’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ పిల్లాడిని దూరంగా నెట్టేస్తుంది. ఆ పిల్లాడు కూడా పిల్లి చెప్పినట్లుగా చేయడం అక్కడున్న వారికి మరింత ఆసక్తిని కలిగించింది.
Young Woman Video: వేదికపై డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిన యువకుడు.. ఒడిలో పడుకుని మరీ..
పిల్లి చేసిన ఈ పని చూసి ముచ్చటపడిపోయిన పిల్లాడి తండ్రి.. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ పిల్లి చేస్తున్న పని చూడముచ్చటగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.85 లక్షలకు పైగా లైక్‌లు, 4.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..