Doctor with MA Degree: దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..
ABN , Publish Date - Apr 05 , 2025 | 09:01 PM
ఓ అసాధారణ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ చీటీలో డాక్టర్ పేరు పక్కన పొలిటికల్ సైన్స్ ఎమ్మే డిగ్రీ కనిపించడమే ఇందుకు కారణం. ఇది చూసి జనాలు ఛలోక్తులు పేలుస్తు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ అయ్యేందుకు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి చదవాలి. ఆపై క్షేత్రస్థాయిలో అనుభవం గడించాలి. ఇంత శ్రమపడితే గానీ పేషెంట్లకు సరైన చికిత్స అందించగలిగే నైపుణ్యం రాదు. మరోవైపు.. ఇవేమీ పట్టించుకోని నకిలీ డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఉదంతాలు తరచూ వెలుగు చూస్తూనే ఉంటాయి. ఫేక్ సర్టిఫికేట్లు, యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి వైద్యం చేసి చివరకు పోలీసులకు చిక్కుతుంటారు. అయితే, వీటన్నిటినీ మించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఉదంతంలోని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఇలాంటోళ్లు కూడా డాక్టర్ అవుతారా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందీ తెలీయకపోయినా ఈ ఉదంతం మాత్రం జనాలను విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రిస్క్రిప్షన్ పైన ఇద్దరు డాక్టర్ల పేర్లు వాటితో పాటు వారి చదువులకు సంబంధించిన వివరాలు కూడా ముద్రించి ఉన్నాయి. ఒక డాక్టర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివినట్టు ఉండగా మరో డాక్టర్ పొలిటికల్ సైన్స్‌లో ఎమ్మే చేసినట్టు రాసుకున్నాడు.
ఇది చూసి జనాలు షాకైపోతున్నారు. పొలిటికల్ సైన్స్‌లో ఎమ్మే చేసిన వారు డాక్టర్ ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. తాను డాక్టర్ అని భావించడమే కాకుండా తన ఎమ్మే డ్రిగ్రీని పేరు పక్కన చేర్చడం నిజంగానే వింతగా ఉందని కామెంట్ చేశారు. అసలు ఇది నిజమై ప్రిస్క్రిప్షనా కాదా అని కూడా కొందరు ప్రశ్నించారు.
ఇక ఈ పోస్టుపై ఛలోక్తులకైతే అంతేలేకుండా పోయింది. మెడికల్ సైన్స్ అయినా పోలిటికల్ సైన్స అయినా రెండూ సైన్సులే కదా అని ఆ డాక్టర్ భావిస్తుండొచ్చని అన్నారు. ఇక ఈ ప్రిస్క్రిప్షన్‌లో పారాసిటమాల్‌తో పాటు బీకాంప్లెక్స్ ఔషధం కూడా రాసి ఉండటం కొసమెరుపు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి మీరూ ఈ పోస్టు చూసి కాసేపు మనసారా నవ్వుకోండి!
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో చేతిలో ఓటమి.. ఆఫ్ఘన్ ప్రేక్షకులను కొట్టబోయిన పాక్ స్టార్ క్రికెటర్
దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్
అత్తపై కోడలి పైశాచికత్వం.. వృద్ధురాలని కూడా చూడకుండా జుట్టుపై నేలపై ఈడుస్తూ..