Share News

Theft Funny Video: బైకును తెలివిగా చోరీ చేస్తున్న దొంగలు.. చాటుగా వీడియో తీస్తున్న యువకుడు.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:05 PM

ఇద్దరు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైకును చూసిన దొంగలు, దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. అదే సమయంలో ఓ వ్యక్తి వారిని దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Theft Funny Video: బైకును తెలివిగా చోరీ చేస్తున్న దొంగలు.. చాటుగా వీడియో తీస్తున్న యువకుడు.. చివరకు చూస్తే..

స్మార్ట్ ఫోన్‌‌కు ఎడిక్ట్ అవుతూ కొందరు అనేక సమస్యలను కొని తెచ్చుకుంటుంటే .. మరికొందరు అదే స్మార్ట్ ఫోన్‌తో అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు. ఇదే స్మార్ట్ ఫోన్ కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తుంటుంది. మరికొన్నిసార్లు మనుషులు చేయలేని పనులను సైతం సులభంగా చేసేస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు దొంగలు రాత్రి వేళ బైకు చోరీ చేసేందుకు వెళ్లారు. ఎంతో తెలివిగా బైకును చోరీ చేయాలని చూడగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైకును చూసిన దొంగలు, (Thieves attempt to steal bike) దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. వారిలో ఓ వ్యక్తి కాస్త దూరంగా కూర్చుని గమనిస్తుండగా.. మరో వ్యక్తి బైకు వద్దకు వెళ్లాడు. ముందుగా బైకు హ్యాండిల్‌ వద్ద ఉన్న వైర్లను అటూ, ఇటూ మార్చి జాయిట్ చేశాడు.

Young Woman Video: వేదికపై డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిన యువకుడు.. ఒడిలో పడుకుని మరీ..


వైర్లను మార్చడంతో ఆఫ్‌లో ఉన్న లైట్లు కూడా వెలిగాయి. ఆ తర్వాత లాక్‌లో ఉన్న హ్యాండిల్‌ను కాలితో తన్నుతూ అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అదే సమయంలో ఓ ఇంటిపై ఉన్న వ్యక్తి ఇదంతా వీడియో తీస్తుంటాడు. తర్వాత దొంగను పిలిచి కామెడీగా మాట్లాడతాడు. ఆ వ్యక్తిని చూసినా కూడా ఆ దొంగలో భయం కనిపించదు. పైగా హ్యాండిల్‌ను తన్నుతూ అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..


అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి వీడియో తీస్తున్నాడనే విషయాన్ని గమనించిన ఆ దొంగలు (Thieves ran away after seeing camera) అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇలా ఫోన్ సాయంతో దొంగలను భయపెట్టి, బైకు చోరీ కాకుండా చూశాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనిషికి భయపడని దొంగ.. కెమెరాకు భయపడ్డాడు’’.. అంటూ కొందరు, ‘‘దొంగలను పరుగులు పెట్టించిన కెమెరా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2500కి పైగా లైక్‌లు, 80 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 12:05 PM