Crocodile vs Buffalo: నరాలు తెగే ఉత్కంఠ.. నది ఒడ్డున నీళ్లు తాగుతున్న దున్నపోతుపై మొసలి అటాక్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-09-19T20:16:06+05:30 IST
నీటిలో ఉన్న మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువు ప్రాణాలైనా గాల్లో కలిసిపోవాల్సిందే. మొసలికి ఉన్న స్థాన బలిమి ముందు ఎంత బలశాలి అయినా నిలవడం కష్టం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప బతికి బయటపడడం జరగదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ గేదె.. మొసలి నోటికి చిక్కింది..
నీటిలో ఉన్న మొసలికి (Crocodile) చిక్కితే ఎంత పెద్ద జంతువు ప్రాణాలైనా గాల్లో కలిసిపోవాల్సిందే. మొసలికి ఉన్న స్థాన బలిమి ముందు ఎంత బలశాలి అయినా నిలవడం కష్టం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప బతికి బయటపడడం జరగదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ గేదె (Buffalo).. మొసలి నోటికి చిక్కింది.. ఆ రెండూ చాలా సేపు పోరాటం చేశాయి.. ఆ ఘటనను అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Crocodile Videos).
top_tier_wilderness అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని గేదెలు నీటి కోసం ఓ మడుగులోకి దిగాయి. వాటిల్లో ఒక గేదెను మొసలి పట్టుకుంది. గేదె ముక్కును మొసలి తన నోటితో పట్టుకుంది. నోటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే గేదె ధైర్యం కోల్పోలేదు. ఆ మొసలిని మెల్లిగా ఒడ్డు వరకు లాక్కెళ్లిపోయింది. ఒడ్డు ఎక్కినా కొద్ది సేపటి వరకు మొసలి తన పట్టు విడవ లేదు. గేదె కూడా గట్టిగా తన బలం ఉపయోగించి ఎదురు నిలవడంతో కాసేపటికి మొసలి గేదెను వదిలేసి తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది.
Marriage: పెళ్లిలోనే ఇదేం పాడు పనయ్యా బాబూ.. వధూవరులిద్దరూ పోటీ పడి మరీ ఏం చేస్తున్నారో మీరే చూడండి..!
ఆ ఘటనను అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 32 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``పాపం.. ఆ గేదె ముక్కు బాగా దెబ్బతిని ఉంటుంది``, ``ఒడ్డుకు వచ్చాక కూడా మిగతా గేదెలు తమ సహచరుడికి సహాయం చేయలేదు``, ``ఆ గేదె చాలా లక్కీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.