పురుషాంగాన్ని తొలగించిన డాక్టర్లు.. చేతి నుంచి కొత్తగా మొలిపించి మళ్లీ అతికించారు.. ఎందుకిలా చేయాల్సి వచ్చిందంటే..
ABN , First Publish Date - 2023-02-25T16:06:28+05:30 IST
ఎవరో కొందరు వైద్యులు డబ్బుల కోసం కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో ఆడుకున్నంత మాత్రాన.. అందరూ అలాగే ఉంటారనుకోవడం ముమ్మాటికీ తప్పే అవుతుంది. వైద్యో.. నారాయణో హరి.. అన్న నానుడిని నిజం చేస్తూ ప్రాణాపాయంలో ఉన్న ఎందరో..
ఎవరో కొందరు వైద్యులు డబ్బుల కోసం కక్కుర్తి పడి, రోగుల ప్రాణాలతో ఆడుకున్నంత మాత్రాన.. అందరూ అలాగే ఉంటారనుకోవడం ముమ్మాటికీ తప్పే అవుతుంది. వైద్యో.. నారాయణో హరి.. అన్న నానుడిని నిజం చేస్తూ ప్రాణాపాయంలో ఉన్న ఎందరో రోగులకు తిరిగి ప్రాణం పోసి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంటారు. తాజాగా, జైపూర్ వైద్యులు అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి, ఓ రోగికి జీవితాన్ని ప్రసాదించారు. పురుషాంగాన్ని తొలగించిన డాక్టర్లు.. చేతిపై కొత్తగా మొలిపించి మళ్లీ అతికించారు. అసలు ఎందుకిలా చేయాల్సి వచ్చిందంటే...
రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు.. అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి, ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. స్థానిక బుండి అనే ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి అరుదైన అనారోగ్య వచ్చి పడింది. చాలా కాలంగా ఇతను పురుషాంగ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ అవడంతో చివరకు జైపూర్ ఆస్పత్రి (Jaipur Hospital) వైద్యులను సంప్రదించాడు. అన్ని పరీక్షలూ నిర్వహించిన డాక్టర్లు.. చివరికి రోగి పురుషాంగాన్ని (penis) తొలగించాలని చెప్పారు. అయితే వృద్ధుడు మొదట ఇందుకు ఒప్పుకోలేదు. అదే జరిగితే ప్రాణానికి ప్రమాదమేమో అని భయపడ్డాడు. అయితే కృత్రిమ పురుషాంగం అమర్చడం ద్వారా ఎలాంటి సమస్యలూ ఉండవని వైద్యులు ధైర్య చెప్పడంతో చివరకు అంగీకరించాడు. పురుషాంగాన్ని తొలగించిన వైద్యులు.. అనంతరం రోగి ఎడమ చేతి నుంచి చర్మం, నరాలు, రక్తనాళాలను తీసుకున్నారు.
చర్మం, నరాలు, రక్తనాళాలతో కృత్రిమంగా మరో పురుషాంగాన్ని తయారు చేసి ఏర్పాటు చేశారు. మైక్రో సర్జికల్ టెక్నిక్ (Micro surgical technique) సాయంతో కృత్రిమ పురుషాంగానికి (artificial penis) రక్త ప్రసరణ అందేలా చేశారు. సహజసిద్ధమైన పురుషాంగం తరహాలోనే ఉండడంతో పాటూ ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో రోగి ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి కేన్సర్ చాలా అరుదుగా (rare cancer) సోకుతుంటుందని చెప్పారు. ఇలాంటి కేసులో చాలా వరకు పురుషాంగాన్ని తొలగించాల్సి వస్తుందన్నారు. కృత్రిమ పురుషాంగంతో ఎలాంటి సమస్యలూ ఉండవని, ఆపరేషన్ అనంతరం కేవలం రెండు వారాల్లో రోగి సాధారణ జీవితం గడపొచ్చని చెప్పారు. తమ ఆస్పత్రిలో సుమారు పదేళ్లుగా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.