AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!

ABN , First Publish Date - 2023-04-18T14:13:58+05:30 IST

ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ లేకపోయినా, ఏసీ-కూలర్ లేకపోయినా ఇల్లంతా చల్లగా ఏ చెట్టు నీడనో ఉన్నట్టు అనిపిస్తుంది

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!

ఎండలు భగ్గున మండిపోతున్నాయి. ఏసీ-కూలర్(Ac-Cooler) లు అందరికీ ఉండవు. అవి లేని ఇళ్ళలో ఫ్యాన్లు(ceiling fan) మాత్రమే ఉంటాయి. కానీ వేసవిలో కరెంట్ కోత(Power cut) వల్ల ఏసీ-కూలర్ ఉన్న ఇల్లయినా గప్ చుప్ గా ఉండాల్సిందే.. బయటినుండి ఇల్లలోకి వచ్చే వేడి గాలులకు ఇల్లంతా వేడి సెగ కొడుతుంది. ఇలా కాకుండా బయట ఎంత వేడి ఉన్నా ఇంట్లో చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇవి పాటిస్తే కరెంట్ లేకపోయినా, ఏసీ-కూలర్ లేకపోయినా ఇల్లంతా చల్లగా ఏ చెట్టు నీడనో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

ఇంట్లోని గదులలో ఉపయోగించని వస్తువులుంటే వాటిని అటకెక్కించాలి. గదులలో వస్తువులు ఎక్కువగా ఉంటే వేడిగాలి ఎక్కువగా చేరుతుంది. అది గదిగోడలను వేడెక్కించి ఇల్లంతా వెచ్చగా మార్చేస్తుంది. ఫర్నిచర్(Furniture) తక్కువగా ఉన్న గదులలో చల్లదనం పాళ్లు ఎక్కువగా ఉంటాయి.

గదులకు కిటికిలు(Windows) ఉంటే ఉదయం 5నుండి 8వరకు, సాయంత్రం 7నుండి 10వరకు మాత్రమే కిటికిలు తెరవాలి. మధ్యాహ్న సమయాల్లో కిటికిలు మూసివేయాలి. అలాగే వెంటిలేటర్లు క్రాస్ గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే గాలి బయటకు రావడం తిరిగి వెచ్చనిగాలి బయటకు వెళ్లడం సులువుగా జరుగుతుంది. కిటికిల దగ్గర కాస్త మందంగా ఉన్న కర్టెన్లు(curtains) ఉపయోగిస్తే వేడి చాలావరకు లోపలికి రాదు. అలాగే లేత రంగులున్న(Light colour) కర్టెన్లు వేడిని ఎక్కువ గ్రహించవు.

Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!


ఇంటి కిటికిలలో ఒక చిన్న గిన్నె(small bowl) పెట్టి అందులో కొన్ని గసగసాలు(poppy seeds) వేసి నీళ్ళు పోయాలి. ఈ చిన్న చిట్కా గది మొత్తాన్ని చల్లగా ఉంచుతుంది. గిన్నెలో నీళ్లు ఆవిరైపోతే మళ్లీ పోసుకోవచ్చు. సోఫాలు, కుర్చీలలో దిండ్లు ఎక్కువగా ఉన్నట్టైతే వాటిని తొలగించాలి. గదులలో కార్పెట్లు(carpet) ఉంటే వాటిని తొలగించాలి. గది మొత్తం వేడిగా మార్చేయడంలో ఈ కార్పెట్లు పెద్ద పాత్ర పోషిస్తాయి.

గదులలో వీలైనంత వరకు లైట్లు వేయకుండా ఉండటం మంచిది. లైట్లనుండి వెలువడే వేడి గదులను మరింత వేడిగా మారుస్తుంది. వంట పనులు తొందరగా ముగిస్తే ఇల్లు చల్లగా ఉంటుంది. బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వంట చేస్తే వేడి ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే 12గంటలలోపు వంట ముగించుకుంటే బెస్ట్. చల్లదనాన్ని ఇచ్చే మొక్కలను పెంచడం, ఇంటిని తడిబట్టతో తుడవడం చేస్తుంటే వేడి చాలావరకు తగ్గుతుంది.

అమ్మబాబోయ్.. పెళ్ళిలో స్వీట్లు బాలేవని ఈ పెళ్ళికొడుకు ఎంత ఘోరం చేశాడు.. పెళ్ళికూతురు తమ్ముడిని ఎత్తుకెళ్ళి ఏకంగా..


Updated Date - 2023-04-18T14:52:35+05:30 IST