Viral News: ప్రియురాలంటూ ఓ వ్యక్తి బ్యాగులో ఏం వేసుకుని తిరుగుతున్నాడో తెలిసి కంగుతిన్న పోలీసులు.. చివరిలో ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-02T12:57:34+05:30 IST

పెరూ (Peru) దేశంలో ఓ యువకుడి ప్రవర్తన పోలీసులకు షాక్‌కు గురి చేసింది.

Viral News: ప్రియురాలంటూ ఓ వ్యక్తి బ్యాగులో ఏం వేసుకుని తిరుగుతున్నాడో తెలిసి కంగుతిన్న పోలీసులు.. చివరిలో ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: పెరూ (Peru) దేశంలో ఓ యువకుడి ప్రవర్తన పోలీసులకు షాక్‌కు గురి చేసింది. 800 ఏళ్ల నాటి 'మమ్మీ'ని (Mummy) బ్యాగ్‌లో వేసుకుని తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏంటి ఇలా మమ్మీని బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతున్నావు అని ప్రశ్నించిన పోలీసులకు అతడి సమాధానం విస్తుపోయేలా చేసింది. ఆ మమ్మీ తన గర్ల్‌ఫ్రెండ్ (Girlfriend) అని తాపీగా చెప్పాడు మనోడు. అది విన్న పోలీసులు కంగుతిన్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరూలోని పునో ప్రాంతానికి చెందిన 26ఏళ్ల జూలియో సీజర్ బెర్మెజో (Julio Cesar Bermejo) కొంతకాలం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసి మానేశాడు.

ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా అతడు తన పాత డెలివరీ బ్యాగ్‌లో (Delivery Bag) ఓ మమ్మీని పెట్టుకుని తిరుగుతున్నాడు. గత శనివారం రాత్రి జూలియో తన స్నేహితులతో కలిసి అదే బ్యాగ్‌తో రోడ్డు పక్కన ఉండగా.. అటువైపుగా పోలీసులు పెట్రోలింగ్‌కు వచ్చారు. ఆ సమయంలో మనోడి వద్ద ఉన్న ఆ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో దాన్ని తెరిచి చూపించాలని జూలియోను పోలీసులు అడిగారు. మొదట బ్యాగ్‌ను తెరవడానికి నిరాకరించిన అతడు.. పోలీసులు గట్టిగా చెప్పడంతో తెరిచాడు. దాంతో బ్యాగులో ఉన్న మమ్మీని చూసి అవాక్కవ్వడం పోలీసుల వంతైంది. బ్యాగ్‌లో మమ్మీ ఉండడం చూసిన పోలీసులు వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై జూలియోను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: నిన్నటి వరకు పదికి ఇరవైకి స్నేహితుల వద్ద చేతులు చాచిన ఆమె.. ఇవాళ కోటీశ్వరురాలు.. రాత్రికి రాత్రే మారిపోయిన సేల్స్ ఉమెన్ ఫ్యూచర్..

Peruu.jpg

అయితే, పోలీసుల విచారణలో అతడు విస్తుపోయే నిజాలు చెప్పాడు. ఆ మమ్మీని తాను అమ్మడానికి తీసుకురాలేదని, దాన్ని తన స్నేహితులకు చూపించడానికి తెచ్చినట్లు తెలిపాడు. అంతేగాక 30 ఏళ్ల క్రితం తన తండ్రి తనకు దాన్ని ఇచ్చాడని, అప్పటి నుంచి అది తనతోనే ఉన్నట్లు చెప్పాడు. "ఇంట్లో అది నా రూంలోనే ఉంటుంది. రోజూ నా పక్కనే పెట్టుకుని నిద్రపోతా. నాకు బాగా అలవాటైపోయింది. చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అంతేకాదు ఆధ్యాత్మికంగా అది నా ప్రియురాలు" అని జూలియో చెప్పుకొచ్చాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆ మమ్మీని పురావస్తు శాఖ అధికారులతో పరీక్షలు చేయించారు. దాంతో అది 600 నుంచి 800 ఏళ్ల క్రితం నాటిదని తేలింది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. జూలియో అమ్మాయిగా భావిస్తున్న ఆ మమ్మీ పురుషుడిదట. అతడు చనిపోయేనాటికి సుమారు 45ఏళ్లు ఉంటదని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఆ మమ్మీ ఎవరిది? జూలియో తండ్రి దాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? అనే విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

Updated Date - 2023-03-02T13:31:29+05:30 IST