Sleeping: రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా..? రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2023-08-17T13:08:56+05:30 IST

అసలు రోజులో 5గంటల కంటే తక్కువ నిద్రపోతే జరిగేదేంటి? నిద్రకోల్పోవడం ద్వారా జరిగే నష్టాన్ని సరిచేయడం సాధ్యమేనా?

Sleeping: రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా..? రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే జరిగేది ఇదే..!

శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. రోజులో సరిపడినంత నిద్రపోకపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని అటు సాంప్రదాయ వైద్యుల నుండి ఇటు అవగాహన ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరు చెబుతారు. కానీ నేటి బిజీ లైఫ్ కారణంగా చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాత్రి 2,3 గంటల వరకు మొబైల్, ల్యాప్టాప్ పట్టుకుని పనిచేసుకోవడం, తరువాత మళ్లీ ఉదయాన్నే 7,8 గంటలకు లేచి ఉరుకులు పరుగుల మీద స్కూళ్లు, ఆఫీసులకు పరిగెత్తడం జరుగుతుంటుంది. దీనివల్ల చాలామంది వారాంతాలను నిద్రకు ఉపయోగించుకుంటూ ఉంటారు. దీనివల్ల నిద్ర కవర్ అయిపోతుందని అనుకుంటారు. అసలు రోజులో 5గంటల కంటే తక్కువ నిద్రపోతే జరిగేదేంటి? నిద్రకోల్పోవడం ద్వారా జరిగే నష్టాన్ని సరిచేయడం సాధ్యమేనా? పూర్తీగా తెలుసుకుంటే..

చదువులు, ఉద్యోగాల కారణంగా నేటికాలంలో చాలామంది నిద్రపోతున్న సమయం(Sleeping Time) తక్కువ. రాత్రి ఆలస్యంగా పడుకుని, మళ్ళీ ఉదయమే ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. మనిషికి రోజులో కనీసం 6నుండి 8 గంటలసేపు నిద్ర ఉండాలని అందరూ చెబుతారు. కానీ అధికశాతం మంది పట్టుమని 5గంటలు కూడా నిద్రపోవడం లేదు. ఇలా రోజూ 5గంటలకంటే తక్కువ నిద్రపోవడం వల్ల రక్తపోటు, హృదయస్పందనరేటు క్షీణించిపోతాయి. సాధారణంగా నిద్రసమయంలో హృదయ స్పందనరేటు పెరుగుతుంది. కానీ రోజులో 5గంటకంటే తక్కువ నిద్రపోవడం వల్ల నిద్రాచక్ర వ్యవస్థ దెబ్బతింటుంది, హృదయ స్పందన రేటు క్షీణిస్తుంది. ఈ కారణంగా గుండెపనితీరు నెమ్మదించడం, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి

YouTube: యూట్యూబ్ ఆ వీడియోలను ఎందుకు డిలీట్ చేస్తోంది.. కొద్ది వారాల పాటు అదే పనిలో ఉండబోతోందట..!



. రోజంతా 5గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారు చాలామంది సెలవు రోజుల్లో తమ వారం రోజుల నిద్రలేమిని కవర్ చేస్తుంటారు. సెలవు రోజంటే లేజీ డే గా తినడం, నిద్రపోవడం వంటి పనులకే కేటాయిస్తుంటారు. కానీ దీని వల్ల హృదయస్పందన, రక్తపోటు వ్యవస్థలు గందరగోళానికి లోనవుతాయి. ఇవి అధిక బరువు, మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, మధుమేహం వంటి ఇతర సమస్యలకు మూలకారణం అవుతాయి. రోజుల తరబడి నిద్రను కోల్పోయిన తరువాత ఈ వ్యవస్థను తిరిగి సరిచేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. ముఖ్యంగా యువత ఈ నిద్ర సమస్యకు లోనైతే 35 నుండి 40ఏళ్ళ లోపు గుండె సంబంధ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సరిదిద్దుకోవడంకోసం నిద్ర నియమాలను దీర్ఘకాలంపాటు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

Airport: విమానాశ్రయంలోని బాత్రూంలో పర్సు, బ్యాగులను మర్చిపోయిందో మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!


Updated Date - 2023-08-17T13:08:56+05:30 IST