Valentines Week 2023: ప్రేమికుడికి ఇలా ప్రేమను తెలీజేయండి..!

ABN , First Publish Date - 2023-02-04T07:10:31+05:30 IST

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బాయ్‌ఫ్రెండ్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని అమ్మాయిలు కోరుకుంటారు.

Valentines Week 2023: ప్రేమికుడికి ఇలా ప్రేమను తెలీజేయండి..!
gifts ideas

వాలెంటైన్స్ డేని ప్రేమికులు చాలా రకాలుగా జరుపుకోవచ్చు కానీ మీ ప్రేమికుడికి ప్రత్యేకమైన బహుమతి ఏది ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ తికమకపెడుతుంది.. ముఖ్యంగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బాయ్‌ఫ్రెండ్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని అమ్మాయిలు కోరుకుంటారు. అబ్బాయిలకు ఉపయోగపడే వాటిని బహుమతిగా ఎలా ఎంచుకోవాలో చూద్దాం.

ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా వాలెంటైన్స్ గిఫ్ట్ ఐడియాలు..

ట్రాక్ సూట్

బాయ్‌ఫ్రెండ్‌కి బహుమతిగా ఇవ్వాలనుకుంటే, ట్రాక్‌సూట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. అబ్బాయిలకు ట్రాక్‌సూట్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాయామం నుండి ప్రయాణం వరకు, అబ్బాయిలు సౌకర్యవంతంగా వీటిని ధరించడానికి ఇష్టపడతారు. ట్రాక్‌సూట్‌ బాయ్‌ఫ్రెండ్‌కి ఇష్టమైన రంగును అడిగి తెలుసుకుని తీసుకోండి.

వాచ్..

అబ్బాయిలు గడియారాలను ఇష్టపడితే, దానిని బహుమతిగా ఇవ్వవచ్చు. వాచ్ ఇస్తున్నప్పుడు, వారికి నచ్చే వాచ్ ఇవ్వడానికి చూడండి.

సైడ్ బ్యాగ్

చిన్న చిన్న వస్తువులను క్యారీ చేయడానికి సైడ్ బ్యాగ్ అబ్బాయిలకు బావుంటుంది. అతనికి సింపుల్ గా నచ్చేస్తుంది కూడా. అందులో ఫోన్, చార్జర్, చిన్న టవల్, మాస్క్స విజిటింగ్ కార్డ్ సులభంగా కేరీ చేసేలా ఇట్టే నచ్చేసే బహుమతుల్లో ఇదీ ఒకటి.

ఫోటో ఫ్రేమ్

మీ ఇద్దరి ప్రేమకు గుర్తుగా మంచి ఫోట్ ఫ్రేమ్ ను కూడా ఎంచుకోవచ్చు. అతనికి నచ్చే కలర్, సింపుల్ డిజైన్, సింపుల్ లే అవుట్ తో చక్కగా ఆకర్షణీయంగా ఉండేలా చిన్న ఫ్రేమ్ ని ఎంచుకోండి.

చాక్లెట్స్ లేని రోజేదుందని..

ముఖ్యంగా అబ్బాయిలు చాక్లెట్స్ తినరని, అమ్మయిలే ఇష్టపడతారని అనుకుంటారు కానీ చాక్లెట్స్ తో కూడా ప్రేమను తెలియజేయచ్చు. సింపుల్ గా తనకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో వాటిని ఎంచుకుని ఇవ్వచ్చు.

షర్ట్స్..

నచ్చిన బ్రాండ్స్ ఎంచుకుని దానిని తెలీకుండా అతనికి ఇస్తే మీ ప్రేమను ప్రత్యేకంగా తెలియజేసినట్టే..

Updated Date - 2023-02-09T17:59:08+05:30 IST