Viral Video: ‘‘పంతం నీదా.. నాదా.. సై’’.. అంటూ పోటీ పడిన మొసలి, గేదె.. చివరికి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-09-19T21:46:45+05:30 IST
వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జి ఉండాలనేది సామెత. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా తమ కంటే చిన్న వారిపై విజయం నల్లేరుపై నడకలా ఉంటుంది. అయితే ప్రతిసారీ ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే చివరికి ఇంకేదో అవుతుంటుంది. ప్రధానంగా జంతువుల విషయంలో ...
వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జి ఉండాలనేది సామెత. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా తమ కంటే చిన్న వారిపై విజయం నల్లేరుపై నడకలా ఉంటుంది. అయితే ప్రతిసారీ ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే చివరికి ఇంకేదో అవుతుంటుంది. ప్రధానంగా జంతువుల విషయంలో ఇలాంటి సన్నివేశాలు తరచూ చూస్తూ ఉంటాం. పులులు, సింహాలు, మొసళ్లు తదితర జంతువులు.. చిన్న చిన్న జంతువులను వేటాడే సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీరు తాగుతున్న సమయంలో గేదెపై ఓ మొసలి దాడి చేస్తుంది. ఇక దాదాపు దానికి ఆహారమవుతుందనే సమయంలో సడన్గా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
సోషల్ మీడియాలో మొసలి దాడికి సంబంధించిన వీడియో (Crocodile attack videos) తెగ వైరల్ అవుతోంది. అడవిలోని ఓ పెద్ద సరస్సు వద్దకు కొన్ని గేదెలు నీరు తాగేందుకు వస్తాయి. అన్నీ నీళ్లు తాగి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న ఓ మొసలి గేదెను టార్గెట్ చేస్తుంది. చివరకు మెల్లగా సమీపానికి వచ్చి ఒక్కసారిగా గేదెపై ఎటాక్ చేస్తుంది. గెదెను మూతిని నోటితో (Crocodile attack on buffalo) గట్టిగా పట్టుకుంటుంది. ఊహించని ఈ పరిణామంతో గేదె ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. మొసలి నుంచి విడిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. మరోవైపు మొసలి కూడా గట్టిగా పట్టుకుని గేదెను నీటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.
తీరా నీళ్లలోకి లాగే సమయంలో గేదె తనలోని శక్తినంతా బయటికి తీసి, అంద పెద్ద మొసలిని సైతం నీటి నుంచి గట్టు మీదకు లాక్కెళ్తుంది. పక్కన ఉన్న గేదెలు కూడా అక్కడే ఉండి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. అయితే చివరకు గేదెతో జరిగిన పోరాటంలో మొసలి చేతులెత్తేస్తుంది. వామ్మో! ఇక నావల్ల కాదు.. ఈ గేదెలకు దొరక్కుండా నీటిలోకి వెళ్లిపోవడమే సేఫ్’’.. అనుకుంటూ దాన్ని వదిలేసి బతుకుజీవుడా అంటూ నీళ్లలోకి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రాణాలు కాపాడుకునేందుకు గేదె చేసిన పోరాటం అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! చూస్తుంటేనే చాలా భయంగా ఉంది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.