Viral: డాబాపై టీవీ యాంటినాకు ఇలా ప్లాస్టర్లు వేసి మరీ ఓ డబ్బాను చుట్టేశారు.. సడన్‌గా ఇప్పుడీ ఫొటో ఎందుకు వైరల్‌గా మారిందంటే..!

ABN , First Publish Date - 2023-06-30T10:29:09+05:30 IST

ఇబ్బంది కలిగినప్పుడే మనిషి తెలివి తేటలు పదునెక్కుతాయి, అద్భుతమైన ఐడియాలు(amazing ideas) వస్తాయి. చెత్తబుట్టలోకి తోసెయ్యాల్సిన వాటిని ఉపయోగంలోకి తెలుస్తుంటారు.

Viral: డాబాపై టీవీ యాంటినాకు ఇలా ప్లాస్టర్లు వేసి మరీ ఓ డబ్బాను చుట్టేశారు.. సడన్‌గా ఇప్పుడీ ఫొటో ఎందుకు వైరల్‌గా మారిందంటే..!

సోషల్ మీడియాలో చాలా వింత విషయాలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసినప్పుడు వెంటనే అర్థం కావు కానీ ఆ తరువాత అసలు విషయం తెలిశాక ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది. మనకెందుకు అలాంటి ఐడియా రాలేదు అని ఓ చిన్న చింత కూడా కలుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో అలానే అనిపిస్తోంది. డాబా మీద టీవీ యాంటినాకు ప్లాస్టర్లు వేసి మరీ ఓ ప్లాస్టిక్ డబ్బాను చుట్టేశారు. దీని వెనుక ఉన్న కారణం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'కామన్ మ్యాన్ ట్యాలెంట్ ఇలాగే ఉంటుంది'అని కితాబులిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

అవసరం అన్నీ నేర్పిస్తుందని అంటారు. నిజానికి ఇబ్బంది కలిగినప్పుడే మనిషి తెలివి తేటలు పదునెక్కుతాయి, అద్భుతమైన ఐడియాలు(amazing ideas) వస్తాయి. చెత్తబుట్టలోకి తోసెయ్యాల్సిన వాటిని ఉపయోగంలోకి తెలుస్తుంటారు. వేసవి ముగిసి వర్షాలు మొదలైన క్రమంలో(monsoon) డిష్ సిగ్నల్స్(dish signals) అస్తవ్యస్తమై టీవీ చూడటంలో అంతరాయం కలిగిస్తుంటాయి. ఓ వ్యక్తి తన మేడ మీద ఉన్న డిష్ నుండి సరైన సిగ్నల్స్ పొందడానికి తెలివిగా ఆలోచించాడు. అతను యాంటీనాను ఓ పొడవాటి ప్లాస్టిక్ డబ్బాతో కవర్ చేశాడు(antenna cover with plastic bottle). అది స్ట్రాంగ్ గా నిలిచి ఉండటానికి దానికి ఓ మందం పాటి పొర వచ్చేలా దాని మూతి భాగానికి ప్లాస్లర్ అతికించాడు. దీంతో గాలి, వాన వంటివి వచ్చినా ఆ యాంటినాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. హాయిగా సిగ్నల్స్ అందుతాయి. ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో టీవీ చూడచ్చు.

Beer Omelette: నూనెకు బదులు బీరుతో ఆమ్లెట్.. ఎలా చేశారని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!


ఈ ఫోటోను Narender అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. 'ఎయిర్టెల్ డిటిహెచ్ కస్టమర్ కేర్ ఈ వర్షాకాలంలో పనికిరాదు,దాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ప్రయోగం' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఎలానూ వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడీ ప్రయోగం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ' వర్షాకాలంలో సిగ్నల్స్ మేఘాల కారణంగా పోతాయి కానీ వర్షం వల్ల కాదు. కాబట్టి ఈ ప్రయోగం వల్ల ఫలితం ఉండదు' అని అంటున్నారు. కానీ కొందరు మాత్రం 'వర్షానికి తడవకుండా యాంటినాను కాపాడటంలో ఈ ప్రయోగం బాగానే పనిచేస్తుంది'అని అంటున్నారు.

Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!


Updated Date - 2023-06-30T10:29:09+05:30 IST