Bus Driving Funny Video: ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం.. ప్రయాణికులకు ఎలా షాకిచ్చారో చూడండి..
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:22 AM
ఓ బస్సు ప్రయాణికులతో రయ్యిమని దూసుకెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకపోయినా.. డ్రైవర్ బస్సును నడిపే తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

కొందరు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్రంగా డ్రైవింగ్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు డ్రైవింగ్ చేసే విధానం చూస్తే ‘‘అరే.. ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ బస్సును నడుపుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ బస్సు ప్రయాణికులతో రయ్యిమని దూసుకెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకపోయినా.. డ్రైవర్ బస్సును నడిపే తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.
డ్రైవర్ తన సీటులో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేస్తుండగా.. పక్కనే మోకాళ్లపై కూర్చొన్న (Bus conductor changing gear) కండక్టర్ గేర్ మారుస్తున్నాడు. ఇంజిన్ బాక్స్ పక్కనే పొడవాటి గేర్ రాడ్డు ఉండాల్సి ఉండగా.. అక్కడ ఏదీ కనిపించలేదు. దీంతో గేర్ రాడ్ రంధ్రంలో ఇనుప రాడ్డు పెట్టి.. డ్రైవర్ సూచనల మేరకు గేర్ మారుస్తున్నాడు. ఇలా డ్రైవర్ బస్సు నడుపుతుంటే.. కండక్టర్ గేర్ మార్చడం చూసి బస్సులోని ప్రయాణికులు అవాక్కవుతున్నారు. వారిద్దరూ ఇలా చాలా దూరం వరకూ బస్సు నడుపుతూ వెళ్లారు.
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదెక్కడి డ్రైవింగ్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 2.40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..