Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:15 PM
ఓ కర్మాగారంలో ఎండు ద్రాక్షలను తయారు చేస్తుంటారు. అయితే వాటిని సహజ సిద్ధంగా కాకుండా కృత్రిమంగా సిద్ధం చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎండు ద్రాక్ష ఇలా చేస్తున్నారేంట్రా బాబోయ్.. ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు కల్తీకి పాల్పడుతూ సొమ్ము చేసుకుంటుంటుంటారు. మామిడి, అరటి పండ్లను కృత్రిమంగా మాగపెట్టడం చూశాం. అలాగే అనేక నిత్యవరసరాల తయారీలో కూడా కల్తీకి పాల్పడడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎండు ద్రాక్షను తయారు చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కర్మాగారంలో ఎండు ద్రాక్షలను (Raisins) తయారు చేస్తుంటారు. అయితే వాటిని సహజ సిద్ధంగా కాకుండా త్వరగా మార్కెట్‌లోకి పంపించేందుకు జిమ్మిక్కులు చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు.
Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..
ఎండు ద్రాక్షలను ప్లాస్టిక్ బకెట్లతో సిద్ధం చేసిన తర్వాత వాటిని ఓ నీళ్ల తొట్టిలో ముంచుతున్నారు. ఆ తోట్టి నీటిలో వాషింగ్ పౌడర్, నూనెను (Washing powder, oil) కలిపిన తర్వాత.. ఆ నీటిలో ద్రాక్షలను ముంచి కడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల పచ్చిగా ఉన్న ద్రాక్షలు కాస్తా.. ఎండు ద్రాక్షల తరహాలో కనిపిస్తున్నాయి.
Bus Driving Funny Video: ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం.. ప్రయాణికులకు ఎలా షాకిచ్చారో చూడండి..
ఇలా నీళ్లలో ముంచిన ద్రాక్షలను ఆరబెట్టి, ఫైనల్‌గా జల్లెడలో వేసి ఎండు ద్రాక్షలను సిద్ధం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్లేంట్రా.. ఎండు ద్రాక్షలను ఇలా కడుగుతున్నారు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇకపై ఎండు ద్రాక్షలను తినాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..