Share News

Police Death Video: తన మరణ శాసనాన్ని తానే రాసుకున్న పోలీస్.. చివరకు ఎలా చనిపోయాడో చూస్తే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:19 PM

రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మరణం ఇలాక్కూడా వస్తుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Police Death Video: తన మరణ శాసనాన్ని తానే రాసుకున్న పోలీస్.. చివరకు ఎలా చనిపోయాడో చూస్తే..

మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు మరణం అంచుల దాకా వెళ్లి ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇంకొందరు అప్పటిదాకా సంతోషంగా ఉంటూ.. ఉన్నట్టుండి తిరిగిరాని లోకాలకు చేరుకుంటుంటారు. మరికొందరు చనిపోయే విధానం చూసినప్పుడు అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పోలీసు చనిపోయిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వెళ్తుంటుంది. అయితే చాలా సేపటి వరకూ కదలకుండా నిలబడ్డ పోలీస్.. ఆ తర్వాత తన చుట్టూ తానే గుండ్రంగా రెండు, మూడు సార్ల తిరిగిన తర్వాత అదుపు తప్పి (Police constable falls under train) నేరుగా ప్లాట్‌ఫామ్‌కు, రైలు మధ్యలో పడిపోతాడు.

Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..


అప్పటికి రైలు వేగంగా వెళ్తుండడంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్లు కనిపిస్తోంది. పోలీస్ అలా కిందపడిపోవడం చూసి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అయితే అప్పటికే పోలీసు పట్టాల మధ్యలో పడిపోయి ఉంటాడు. ఇలా విషాదకర పరిస్థితుల్లో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం చూసి అంతా.. షాక్ అవుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఒకరమైన మూర్చవ్యాధి.. ఇలాంటి సందర్భాల్లో వారికి స్పృహ ఉండదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bus Driving Funny Video: ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం.. ప్రయాణికులకు ఎలా షాకిచ్చారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 01:19 PM