Share News

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 10:55 AM

ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..

వివాహ కార్యక్రమాలు కాస్తా.. ప్రస్తుతం వినోదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఎలాంటి పెళ్లిలో అయినా ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాగే కొన్ని వివాహాల్లో పాటించే ఆచారాలు సైతం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వేదికపై వధూవరులు చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి వింత ఆచారం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Mariage) కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. దండలు మార్చుకున్న వధూవరులు (Bride and groom) వేదికపై నిలబడి ఉండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. వధూవరుల ఎదుట ఓ ఇనుప రాడ్లతో కూడిన హ్యాండిల్ ఉంటుంది.

Bus Driving Funny Video: ఇలాంటి డ్రైవింగ్ ఇండియాలోనే సాధ్యం.. ప్రయాణికులకు ఎలా షాకిచ్చారో చూడండి..


ఆ హ్యాండిల్‌ను వధూవరుల చేతికి ఇవ్వగా.. వరుడు హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకుని కిందకు కొడతాడు. దీంతో పక్కనే ఉన్న పెద్ద టపాసు ఫట్‌మని పెద్ధ శబ్ధంతో పేలిపోతుంది. ఈ శబ్ధానికి వధువు భయంతో చెవులు మూసుకుని పక్కకు జరుగుతుంది. చూస్తుంటే గన్ పౌడర్ (Gun powder) అమర్చి, దాన్ని వధూవరులతో పేల్చినట్లు తెలుస్తోంది. ఇలా పెళ్లిలో వధూవరులు వింతగా టపాసులు పేల్చడం చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు.

Funny Viral Video: ఎక్కడ డాన్స్ చేస్తున్నామనేది కూడా ఇంపార్టెంట్.. ఇతడి పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి ఆచారం.. చాలా వింతగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 490కి పైగా లైక్‌లు, 6.98 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 10:55 AM