మనమంతా దానిని పువ్వు అని అంటాం.. శాస్త్రవేత్తలు మాత్రం దానిని మరోలా సంభోధిస్తారు? ఎందుకలా?

ABN , First Publish Date - 2023-04-27T13:34:31+05:30 IST

అంత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఆ పువ్వును మనమంతా సన్ ఫ్లవర్ లేదా పొద్దుతిరుగుడు పుష్పం(Sunflower) అని అంటాం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిని పుష్పం అని సంబోధించరు.

మనమంతా దానిని పువ్వు అని అంటాం.. శాస్త్రవేత్తలు మాత్రం దానిని మరోలా సంభోధిస్తారు? ఎందుకలా?

అంత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఆ పువ్వును మనమంతా సన్ ఫ్లవర్ లేదా పొద్దుతిరుగుడు పుష్పం(Sunflower) అని అంటాం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిని పుష్పం అని సంబోధించరు. పైగా దానిని పూల గుత్తి అని అంటారు. ఒక్కటిగా కనిపించే దానిలో అనేక పూలు ఉన్నాయంటారు. దీని వెనుక అనేక కారణాలు(Reasons) కూడా ఉన్నాయంటున్నారు. పొద్దుతిరుగుడు రేకలతో జతకూడిన గోధుమరంగు భాగాన్ని మనం పుష్ఫంగా పరిగణిస్తాం. ఈ పువ్వు డజన్ల కొద్దీ రేకులను కలిగి ఉంటుంది.

ఇవన్నీ ఆ గోధుమరంగు భాగానికి జతకూడి, కొన్ని భాగాలుగా విభజితమై ఉంటాయి. అందుకే పొద్దుతిరుగుడును శాస్త్రవేత్తలు(Scientists) పూల గుత్తి అని అంటారు. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఒక పువ్వు.. విత్తనాన్ని లేదా పండ్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ పొద్దుతిరుగుడు విషయంలో అలాజరగదు. ఆ పూవులోని మధ్య భాగాన్ని డిస్క్(Disc) అంటారు, దీనిలో విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. ఒక పొద్దుతిరుగుడు పూవులో 2 వేల వరకూ విత్తనాలు(seeds) అభివృద్ధి చెందుతాయి.

వీటి సాయంతో కొత్త మొక్కలు సిద్ధం చేస్తారు. ఈ విధంగా చూసినా దానిని పూల గుత్తి(bouquet of flowers) అనడం సబబే అని అనిపిస్తుంది. కాగా పొద్దు తిరుగుడు విత్తనంలో అనేక పోషకాలు(Nutrients) లభిస్తాయి. సాధారణంగా మనం పొద్దుతిరుగుడు పూవు పసుపు రంగులోనే ఉంటుందని భావిస్తుంటాం. అయితే ప్రపంచంలో 70 రకాల పొద్దుతిరుగుడు జాతులు ఉన్నాయి. వివిధ పరిమాణాలలోనూ పొద్దు తిరుగుడు పూలు ఉంటాయి. పసుపుతో పాటు, ఎరుపు, నారింజ, ఊదా రంగులలో కూడా పొద్దుతిరుగుడు పూలు లభ్యమవుతాయి. పొద్దుతిరుగుడు పూవు పేరు గిన్నిస్ రికార్డు(Guinness record)లో కూడా స్థానం సంపాదించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పొద్దుతిరుగుడు పూవు 30 అడుగుల మేర ఉంది. 2014లో జర్మనీలో ఈ రికార్డు(record) నమోదైంది.

Updated Date - 2023-04-27T13:34:55+05:30 IST